ప్రపంచ కప్ 2023 భారత గడ్డపై నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 5 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుండగా.. నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టైటిల్ మ్యాచ్ జరగనుంది. అయితే 12 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకోవాలని.. టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని భారత అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ప్రపంచకప్‌లో టీమిండియా అంచనాలపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తన అభిప్రాయాన్ని తెలిపాడు.
Nama Nageswara Rao: కొత్త పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని నామా నాగేశ్వరరావు డిమాండ్
ముందుగా టాప్-4లో స్థానం సంపాదించడమే మన ప్రాధాన్యత అని కపిల్ దేవ్ అన్నారు. ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీలో ఆడటం అంటే అదృష్టం ఉండాలని తెలిపారు. మరోవైపు తాజాగా జరిగిన ఆసియా 2023 ఫైనల్ లో ఎలాంటి ప్రదర్శన చూపించిందో మనందరికీ తెలుసు. భారత్ టీమ్ అద్భుతం.. ఇందులో ఎలాంటి సందేహం లేదని కపిల్ దేవ్ పేర్కొన్నారు. ఈసారి టీమిండియా ప్రపంచకప్ గెలవడం ఖాయమని అన్నారు. ఇదిలా ఉంటే ప్రపంచ కప్ కోసం టీమిండియా చాలా కష్టపడాలని తన మనసు చెబుతోందన్నారు.
Srinivasa Setu Flyover: తీరిని ట్రాఫిక్ కష్టాలు.. శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం జగన్
ఆసియా కప్ 2023లో శ్రీలంకపై చెలరేగిన మహ్మద్ సిరాజ్ గురించి కపిల్ దేవ్ ప్రస్తావించారు. ఆసియా కప్ ఫైనల్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌పై కూడా కపిల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మహ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని అన్నాడు. ఈ రోజుల్లో మన ఫాస్ట్ బౌలర్లు ప్రత్యర్థి జట్లలోని మొత్తం 10 మంది బ్యాట్స్‌మెన్‌లను ఔట్ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకునేందుకు టీమిండియా సిద్ధంగా ఉందని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.
Union Cabinet: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల వేళ.. కేంద్ర కేబినెట్ కీలక భేటీ
ఒకప్పుడు స్పిన్నర్లపైనే జట్టు ఆధారపడేదని.. కానీ ఇప్పుడు అలా కాదన్నారు. ఇప్పుడు ఫాస్ట్ బౌలింగ్ తో జట్టు బలంగా ఉందని తెలిపారు. ఆసియా కప్‌లో టీమిండియా అద్భుతమైన క్రికెట్‌ను ప్రదర్శించిందని చెప్పారు. మరోవైపు ప్రపంచకప్‌కు ముందు టీమిండియాను కపిల్ దేవ్ హెచ్చరించాడు. భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ ఆటగాళ్లలో శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఉన్నారని.. అయితే ఈ ఆటగాళ్లు ప్రపంచకప్‌కు ముందు పూర్తిగా ఫిట్‌గా ఉండకపోవడం మంచి సంకేతం కాదని కపిల్ దేవ్ తెలిపారు.