NTV Telugu Site icon

Rohit Sharma: రోహిత్ శర్మకు ‘మతిమరుపు’.. అన్నీ మరిచిపోతాడు, అదొక్కటి మాత్రం..!

Rohit Sharma

Rohit Sharma

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు చాలా మతిమరుపు. అతను వస్తువులను ఒక దగ్గర పెడుతాడు.. వాటిని మరచిపోతాడు. చాలా సార్లు టాస్ సమయంలో కూడా ముందుగా బౌలింగ్ ఎంచుకోవాలా లేదా బ్యాటింగ్ ఎంచుకోవాలా అని మర్చిపోతాడు. అయితే ‘హిట్ మ్యాన్ ’గా పేరుగాంచిన రోహిత్ గేమ్ ప్లాన్ ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ మరిచిపోడు. ఈ రహస్యాన్ని టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ బయటపెట్టాడు. రోహిత్‌ శర్మపై రాథోడ్ ప్రశంసలు కురిపిస్తూ.. గ్రౌండ్లో అతని వ్యూహం, కెప్టెన్సీ శైలి అద్భుతమని కొనియాడాడు.

MP: ఓ ప్రైవేటు ప్రకటనలో మహిళా కానిస్టేబుల్ ప్రత్యక్షం.. అధికారుల యాక్షన్

తరువర్ కోహ్లి పోడ్‌కాస్ట్‌లో రాథోడ్ మాట్లాడుతూ, “జట్టు సమావేశాలు లేదా వ్యూహాలపై ఇంత ఆసక్తిని ఏ కెప్టెన్ లో చూడలేదు. అతను టాస్ సమయంలో బ్యాటింగ్ చేయాలా లేదా బౌలింగ్ చేయాలా నిర్ణయించుకున్న విషయాన్ని మర్చిపోవచ్చు. అతను తన ఫోన్, ఐప్యాడ్‌ను మరచిపోవచ్చు. కానీ తన గేమ్ ప్లాన్‌ను ఎప్పటికీ మర్చిపోడు. అతను చాలా తెలివైనవాడు. చాలా తెలివైన వ్యూహకర్త.” అని పేర్కొ్న్నాడు. రోహిత్ శర్మ జట్టు వ్యూహంపై ఎక్కువ సమయం కేటాయిస్తాడు. అంతేకాకుండా బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌లతో సమావేశాలకు హాజరవుతాడు. బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌లతో కూర్చుని వారు ఏమి ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆటగాళ్లతో చాలా స్నేహపూర్వకంగా ఉంటాడు.. వారితో టైం స్పెండ్ చేస్తాడు.” అని రోహిత్ శర్మ గురించి రాథోడ్ చెప్పాడు. అతను బ్యాట్స్‌మెన్‌గా అద్భుతమైన ఆటగాడు కావడమే రోహిత్‌లోని మొదటి గుణం. అతను తన ఆటను బాగా అర్థం చేసుకుంటాడని తాను భావిస్తున్నానని.. అతను ఎప్పుడూ స్పష్టమైన గేమ్ ప్లాన్ కలిగి ఉంటాడని రాథోడ్ పేర్కొన్నాడు.

Bhale Unnade: పెళ్ళికి ముందే వేసి చూసుకునే రూల్ పెట్టాలట… రాజ్ తరుణ్ ఈసారి గట్టిగా కొట్టేట్టున్నాడే!

ఇంకా మాట్లాడుతూ, “నాయకుడిగా కూడా ముందు నుండి నాయకత్వం వహించాలి. మిగతా ఆటగాళ్లకు ఇన్సిపిరేషన్ గా ఉండాలంటే మీరు ప్రదర్శన ఇవ్వాలి. రోహిత్ కెప్టెన్ అయినప్పటి నుండి అతను ఎప్పుడూ జట్టును ఆదర్శంగానే నడిపించాడు. ఆటగాళ్లతో రోహిత్ చాలా కనెక్ట్ అయ్యాడు.” అని రాథోడ్ చెప్పాడు. కాగా.. రాథోడ్ పదవీకాలం టీ20 ప్రపంచ కప్ 2024తో ముగిసింది.