Uttarpradesh Bypolls: యూపీ ఉపఎన్నికల్లో ఎస్పీ కూటమిదే హవా.. డింపుల్ యాదవ్ నయా రికార్డ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarpradesh: లోక్‌దళ్ రాష్ట్రంలోని మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మెయిన్‌పురి లోక్‌సభ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య, లోక్‌సభ మాజీ ఎంపీ డింపుల్ యాదవ్ లక్ష ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుత ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణానంతరం ఇక్కడ ఎన్నికలు జరిగాయి. డింపుల్, అఖిలేష్ యాదవ్‌లు ‘నేతాజీ’ అని పిలవబడే ములాయం సింగ్ యాదవ్ సేవలను గుర్తు చేస్తూ.. ఓట్లు వేయాలని ఎన్నికల కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
యూపీ ఉప ఎన్నికలో మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ భార్య.. మామను మించిన మెజారిటీతో దూసుకెళ్తోంది. మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి డింపుల్ యాదవ్ విజయం దాదాపు విజయం ఖరారైందని ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. డింపుల్ తన సమీప భాజపా అభ్యర్థి.. రఘురాజ్ సింగ్ షాక్యాపై భారీ ఆధిక్యంలో ఉన్నారు. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. 2019 ఎన్నికల్లో ములాయంకు 94వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సింగ్‌పై గెలుపొందారు. ఇప్పుడు డింపుల్‌కు అంతకన్నా మెజార్టీ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే లక్ష ఓట్లకు మించి మెజారిటీ రావడం గమనార్హం. సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటగా పిలిచే మైన్‌పురిలో డింపుల్ విజయం ఖాయమేనని పార్టీ శ్రేణులు మొదట నుంచి విశ్వాసంగా ఉన్నాయి. డిసెంబర్ 5న ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగగా.. 56 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది.
Also Read
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
ద్వేషపూరిత ప్రసంగం కేసులో దోషిగా తేలిన తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యే, సమాజ్‌వాదీ పార్టీలో కీలకమైన వ్యక్తి ఆజం ఖాన్‌పై అనర్హత వేటు పడిన రాంపూర్ అసెంబ్లీ స్థానంలో కూడా ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది. బీజేపీకి చెందిన ఆకాష్ సక్సేనాపై సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అసిమ్ రాజా పోటీ చేస్తున్నారు.గత కొన్ని సంవత్సరాలుగా, ఆజం ఖాన్‌పై అనేక క్రిమినల్ కేసులు.. ఎక్కువగా భూ కబ్జా, ఫోర్జరీకి సంబంధించినవి నమోదు కావడంతో ఆయనపై అనర్హతం వేటు పడింది.రాంపూర్ ఉప ఎన్నికలో 40 శాతం కంటే తక్కువ పోలింగ్ నమోదైంది. సమాజ్ వాదీ పార్టీ తన మద్దతుదారులను పోలీసులు ఓటు వేయడానికి అనుమతించలేదని ఆరోపించింది. ఈ ఆరోపణను ప్రభుత్వం తిరస్కరించింది.
Gujarat Election Results 2022: గుజరాత్ సీఎం ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్..
పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ఖతౌలీ స్థానంలో ఎస్పీ మిత్రపక్షమైన ఆర్‌ఎల్‌డీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆర్‌ఎల్‌డీ అభ్యర్థి మదన్ భయ్యా ముందంజలో ఉండగా.. బీజేపీ అభ్యర్థి ద్వితీయ స్థానంలో కొనసాగుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని భానుప్రతాప్‌పూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సావిత్రి మండి ఆధిక్యంలో ఉన్నారు. బీహార్‌లోని కుర్హానీ అసెంబ్లీ స్థానంలో జనతాదళ్ (యునైటెడ్) అభ్యర్థి మనోజ్‌సింగ్ కుష్వాహా ఆధిక్యంలో ఉండగా, రాజస్థాన్‌లోని సర్దార్‌షహర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్‌కుమార్ శర్మ ఆధిక్యంలో ఉన్నారు. ఒడిశాలోని పదంపూర్‌లో బిజు జనతా దళ్ అభ్యర్థి బర్శా సింగ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!