మనం ప్రతీ రోజు సోషల్ మీడియీలో ఎన్నో రకాల వైరల్ వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. అయితే వాటిలో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరి కొన్ని భయాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని ఇలాంటివి కూడా జరుగుతాయా అని అనిపిస్తాయి. అయితే ఇటీవల కొందరు పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా వెళుతున్న యువతులనే టార్గెట్ గా చేసుకుని వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. సెమ్ ఇలాంటి ఘటన ఒకటి రిసెంట్ గా చోటు చేసుకుంది. అది ఎక్కడ జరిగింది అనేది మాత్రం తెలియారాలేదు. కానీ ఆ వీడియో సీసీటీవీలో రికార్డు అయింది.
For harrassing a girl on road pic.twitter.com/TBJmwRVHAc
— Pepe Meme (@pepe_fgm) April 9, 2023
Read Also : Jeff Bezos : చీప్ షర్ట్ వేసిన ప్రపంచ కుబేరుడు
అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ యువతి సింగిల్ గా రోడ్డు మీద నడుచుకుంటూ బస్టాప్ దగ్గరకు వస్తున్నట్లు మనం చూడవచ్చు. అయితే ఆమె వెనకే ఓ పోకిరి వెంటపడ్డాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. ముద్దు పెట్టకోబోయాడు.. దీంతో అగలేదు.. సదరు యువతిని ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి.. ఆమెను తోసేశాడు. ఇదంతా జరుగుతుండగా అక్కడ ఓ బస్సు అప్పుడే అక్కడికి వచ్చి ఆగింది.
Read Also : Amazon Prime subscription price: అమెజాన్ ప్రైమ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన సబ్స్క్రిప్షన్ ధర
యువతిని వేదించిన అతడ్ని ఎవ్వరూ ఏం చేయలేదని అనుకోవద్దు.. బస్సు పక్క నుంచి ఓ ముగ్గురు వ్యక్తులు పరుగున వచ్చి ఆ పోకిరి దగ్గరకు చేరుకుని.. తన్నులతో బుద్ది చెప్పారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి ఇప్పటి వరకు 28.3 మిలియన్ల వ్యూస్ రాగా.. నెటిజన్లు కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు.