ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల టెక్నాలజీలు వస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం మనం 5జి నెట్వర్క్ లో అడుగుపెట్టాం. 2g, 3g, 4g ఇలా జనరేషన్ మారేకొద్ది ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతూ వస్తోంది. ఇక 5g నెట్వర్క్ ద్వారా హై స్పీడ్ డేటా ను మనం వాడుకోగలుగుతున్నాం. ఎంత క్వాలిటీ ఫోటోలైన, ఎంత పెద్ద వీడియోలైనా సరే క్షణాల్లో డౌన్లోడ్ చేసుకుంటూ విక్షిస్తున్నాము. అలాగే అప్లోడ్ చేసే టైంలో కూడా ఎక్కువ సమయం పట్టట్లేదు. ఇక బ్రౌజింగ్ సమయంలో ఏ సైట్ సంబంధించిన సరే క్షణకాలంలో ఇట్లే ఓపెన్ అయిపోతాయి. ఇకపోతే 5g నెట్వర్క్ హై స్పీడ్ పొందాలంటే.. మనం మన సెల్ ఫోన్ లోని కొన్ని మార్పులు చేస్తే ఆ వేగాన్ని పూర్తిగా ఆస్వాదించవచ్చు. ఇక వాటి వివరాలు ఒకసారి చూస్తే..
Also Read: Gunturu Karam: రికార్డ్ సృష్టించిన ‘కుర్చీని మడతపెట్టి’ సాంగ్.. ఏకంగా..
ఇక మనం వాడే స్మార్ట్ ఫోన్ లలో 5G సపోర్ట్ ని కలిగి ఉన్న చాలా ఫోన్స్ ఉన్నాయి. చాలా సందర్భాలలో 5G స్మార్ట్ ఫోన్లు ప్రాథమిక సిమ్ కార్డులో లేదా మొదటి స్లాట్ లో మాత్రమే 5G సపోర్ట్ చేయబడుతుంది. కనుక మనం ఇంటర్నెట్ ఇష్యూ ఫేస్ చేస్తుంటే.. మన సిమ్ కార్డు మొదటి స్లాట్ లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
Also Read: Darling : ప్రభాస్ టైటిల్ తో వస్తున్న ప్రియదర్శి..అదరిపోయిన గ్లింప్స్..
ఇకపోతే 5G కోసం ప్రత్యేకమైన రీఛార్జ్ ప్లాన్ అంటూ లేదు. జియో, ఎయిర్టెల్ లాంటి కంపెనీలు యూజర్లకు ఫ్రీగా అన్‌లిమిటెడ్ 5G సేవలు అందించడం మొదలు పెట్టాయి. అయితే ఇందు కోసం మీరు నిర్దిష్ట ప్లాన్లలో రీఛార్జ్ చేసుకోవాలి. ఈ రెండు కంపెనీల యాప్ లోకి వెళ్లి 5G సర్వీస్ ని యాక్టివేట్ చేసుకొని వాడుకోవాలి. కాబట్టి ‘ఎయిర్టెల్ థాంక్స్’ లేదా ‘మై జియో’ యాప్‌లో వెళ్లడం ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.