Hyderabad: కస్టమర్ల ఆరోగ్యంతో ఆటలు.. ‘కంచి కేఫ్’, ‘కోడికూర చిట్టిగారే’ రెస్టారెంట్లకు నోటీసులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Food Safety Raids-Hyderabad: సైబరాబాద్ పరిధిలోని రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న రెండు ప్రముఖ రెస్టారెంట్లలో నిబంధనల ఉల్లంఘనలను, తీవ్రమైన లోపాలను గుర్తించి నోటీసులు జారీ చేశారు.
కంచి కేఫ్ (పుప్పాలగూడ):
పుప్పాలగూడలోని కంచి కేఫ్‌లో నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. కిచెన్, స్టోర్ రూమ్ మధ్య ఓపెన్ డస్ట్బిన్లు ఉండటంతో ఆ ప్రాంతమంతా తీవ్ర దుర్వాసన వస్తూ, ఈగలు ముసురుతున్నాయి. స్టోర్ రూమ్ సీలింగ్‌పై దుమ్ము పేరుకుపోగా.. గ్రైండింగ్, కూరగాయలు కట్ చేసే ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండి అపరిశుభ్రంగా మారింది. అంతేకాకుండా, వంటకు ఉపయోగించే కాలీఫ్లవర్‌పై ఫంగస్ పెరిగినట్లు అధికారులు గుర్తించారు. డ్రెయిన్ల వద్ద దుర్వాసన రావడం, ఫ్రిజ్‌లలో నిల్వ చేసిన పిండిపై ఎలాంటి లేబులింగ్ లేకపోవడం గమనించారు. వంటగది, స్టోర్ రూమ్‌లలో ఈగలు, బొద్దింకలు తిరుగుతుండటంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటికి తోడు మెడికల్ ఫిట్నెస్, పెస్ట్ కంట్రోల్, వాటర్ టెస్టింగ్, ప్యాకేజింగ్ మెటీరియల్ టెస్టింగ్‌కు సంబంధించిన ఎలాంటి రికార్డులు రెస్టారెంట్ యాజమాన్యం వద్ద అందుబాటులో లేవు. దీంతో ఫుడ్ లేబులింగ్, హౌస్‌కీపింగ్ వెంటనే మెరుగుపరచాలని ఆదేశిస్తూ అధికారులు నోటీసులు ఇచ్చారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
కోడికూర చిట్టిగారే (నల్లగండ్ల):
నల్లగండ్లలోని కోడికూర చిట్టిగారే రెస్టారెంట్లోనూ తనిఖీలు కొనసాగాయి. ఇక్కడ నిల్వ ఉంచిన చికెన్, డెజర్ట్స్‌పై ఎలాంటి లేబుల్స్ లేవని అధికారులు గుర్తించారు. ఆ లేబుల్స్ లేని ఆహార పదార్థాలను అక్కడికక్కడే పారవేయించారు. గ్రైండింగ్ ఏరియా సీలింగ్‌పై దుమ్ము పేరుకుపోవడంతో పాటు కిచెన్ సీలింగ్ అంతా పూర్తిగా జిడ్డుగా మారినట్లు కనుగొన్నారు. ఆ జిడ్డును వెంటనే శుభ్రం చేయాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ రెస్టారెంట్లోనూ ఉద్యోగుల మెడికల్ ఫిట్నెస్, ప్యాకేజింగ్ మెటీరియల్ టెస్టింగ్ రికార్డులు లేకపోవడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తీవ్రంగా పరిగణించి నోటీసులు జారీ చేశారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!