Forgery Ginger Garlic Paste: హైదరాబాద్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి తయారీ.. 50 కేజీల సింథటిక్ ఫుడ్ కలర్ స్వాధీనం
- ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు ముమ్మరం
- కాటేదాన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడి
- అల్లం వెల్లుల్లి తయారు చేస్తున్న తయారీ సంస్థను గుర్తించిన అధికారులు
- 1400 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం
- 50 కేజీల సింథటిక్ ఫుడ్ కలర్ గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. హైదరాబాద్ లోని హోటళ్లు, రెస్టారెంట్లపై ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. నాణ్యత పాటించని హోటళ్లను సీజ్ చేస్తున్నారు. తాజాగా కాటేదాన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడి నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అల్లం వెల్లుల్లి తయారు చేస్తున్న తయారీ సంస్థపై దాడులు చేశారు. సింతటిక్ కలర్లు కలిపి కల్తీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. SKR, ఉమాని సంస్థల్లో అక్రమంగా నిల్వ చేసిన 1400 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను గుర్తించి సీజ్ చేశారు. 50 కేజీల సింథటిక్ ఫుడ్ కలర్ ను స్వాధీనం చేసుకున్నారు.
READ MORE: Supriya Sule: బిట్‌కాయిన్ స్కామ్‌లో చిక్కుకున్న సుప్రియా సూలే.. అది నా వాయిస్ కాదని వెల్లడి
Also Read
కాగా.. ఇటీవల హైదరాబాదులోని బోయిన్‌పల్లిలోని ఒక గోడౌన్ లో తయారు చేస్తున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కేంద్రంపై పోలీసులు దాడి నిర్వహించారు. ఈ తనిఖీలో ఆశ్చర్యకర నిజాలు బయటపడ్డాయి. Sony ginger garlic paste పేరుతో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును ఈ ముఠా తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం ఎనిమిది మంది నిందితులు కలిసి ఈ దందా నిర్వహిస్తున్నారు. తక్కువ ధరకు దొరికే కెమికల్స్ ను ఉపయోగించి అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీలో సిట్రిక్ యాసిడ్ తో పాటు మరికొన్ని కెమికల్స్ ను ఉపయోగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఈ తయారీ కేంద్రం కూడా పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో ఉందని.. ఇక్కడే కల్లీ పేస్ట్ ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కెమికల్స్ ఉపయోగించి తయారు చేసిన ఈ పేస్టును కొన్ని రోజులపాటు ప్లాస్టిక్ డబ్బులలో ఉంచగా.. వాటి మీద పురుగులు తిరుగుతూ కనిపించాయి.. వాటిని కనీసం తొలగించకుండానే అలానే ప్యాకెట్లలో ప్యాక్ చేసి దేశవ్యాప్తంగా వీళ్ళు సప్లై చేస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది.
తాజావార్తలు
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!