తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. హైదరాబాద్ లోని హోటళ్లు, రెస్టారెంట్లపై ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. నాణ్యత పాటించని హోటళ్లను సీజ్ చేస్తున్నారు. తాజాగా కాటేదాన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడి నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అల్లం వెల్లుల్లి తయారు చేస్తున్న తయారీ సంస్థపై దాడులు చేశారు. సింతటిక్ కలర్లు కలిపి కల్తీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. SKR, ఉమాని సంస్థల్లో అక్రమంగా నిల్వ చేసిన 1400 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను గుర్తించి సీజ్ చేశారు. 50 కేజీల సింథటిక్ ఫుడ్ కలర్ ను స్వాధీనం చేసుకున్నారు.
READ MORE: Supriya Sule: బిట్‌కాయిన్ స్కామ్‌లో చిక్కుకున్న సుప్రియా సూలే.. అది నా వాయిస్ కాదని వెల్లడి
కాగా.. ఇటీవల హైదరాబాదులోని బోయిన్‌పల్లిలోని ఒక గోడౌన్ లో తయారు చేస్తున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కేంద్రంపై పోలీసులు దాడి నిర్వహించారు. ఈ తనిఖీలో ఆశ్చర్యకర నిజాలు బయటపడ్డాయి. Sony ginger garlic paste పేరుతో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును ఈ ముఠా తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం ఎనిమిది మంది నిందితులు కలిసి ఈ దందా నిర్వహిస్తున్నారు. తక్కువ ధరకు దొరికే కెమికల్స్ ను ఉపయోగించి అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీలో సిట్రిక్ యాసిడ్ తో పాటు మరికొన్ని కెమికల్స్ ను ఉపయోగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఈ తయారీ కేంద్రం కూడా పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో ఉందని.. ఇక్కడే కల్లీ పేస్ట్ ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కెమికల్స్ ఉపయోగించి తయారు చేసిన ఈ పేస్టును కొన్ని రోజులపాటు ప్లాస్టిక్ డబ్బులలో ఉంచగా.. వాటి మీద పురుగులు తిరుగుతూ కనిపించాయి.. వాటిని కనీసం తొలగించకుండానే అలానే ప్యాకెట్లలో ప్యాక్ చేసి దేశవ్యాప్తంగా వీళ్ళు సప్లై చేస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది.