Food Adulteration: కుల్సుంపురాలో ఫుడ్ స్కాం బట్టబయలు.. కుళ్లిన పదార్థాలతో భారీగా సమోసాలు తయారీ..!

  • హైదరాబాద్ కుల్సుంపురాలో భారీ ఫుడ్ స్కాం బట్టబయలు
  • కుళ్లిన పదార్థాలతో సమోసాలు, పఫ్స్ తయారీ
  • ప్రముఖ హోటళ్లకు సరఫరా చేస్తున్న నిందితుడు
  • అబ్దుల్ రషీద్ (73) అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
  • H-FAST, టాస్క్‌ఫోర్స్, పోలీసులు సంయుక్త దాడులు
  • రూ.5 లక్షల విలువైన నాసిరకం పదార్థాల స్వాధీనం..
Food Adltration

Food Adltration

Food Adulteration: హైదరాబాద్ లోని కుల్సుంపురా ప్రాంతంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కుళ్లిపోయిన పదార్థాలతో సమోసాలు, పఫ్స్ తయారు చేసి నగరంలోని ప్రముఖ హోటళ్లకు సరఫరా చేస్తున్న నిందితుడిని అధికారులు అరెస్ట్ చేశారు. అబ్దుల్ అనే వ్యక్తి అపరిశుభ్ర వాతావరణంలో నాసిరకం పదార్థాలతో ఆహారం తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. ముఖ్యంగా కుళ్లిపోయిన గుడ్లతో ఎగ్ పఫ్స్ తయారు చేసి హోటళ్లకు పంపిస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు దాడులు నిర్వహించారు.

Ishan Kishan: “మరి స్టార్ట్ చేద్దామా..” ఎస్‌ఆర్‌హెచ్‌ కొత్త కెప్టెన్ ప్రత్యర్థి జట్లకు ‘ఫైర్ హెచ్చరిక’.!

ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో పాడైన, నాసిరకం ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. HFAST అధికారులు కేసు నమోదు చేసి అబ్దుల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనతో కుల్సుంపురా ప్రాంతంలో తయారవుతున్న ఫుడ్ ఐటమ్స్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండలని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను హైదరాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో అపరిశుభ్ర పరిస్థితుల్లో తయారవుతున్న ఆహారం కనపడుతుంది. హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలేన్స్ టీం (H-FAST), టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, కులసుంపుర పోలీస్ సమన్వయంతో ఈ దాడి చేపట్టారు.

విశ్వసనీయ సమాచారం ఆధారంగా నిర్వహించిన ఈ దాడిలో 73 ఏళ్ల అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా సమోసాల తయారీ యూనిట్ నిర్వహిస్తున్నట్లు బయటపడింది. అతనికి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSAI) లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ ఏదీ లేకపోవడం గమనార్హం. దర్యాప్తులో భాగంగా కుళ్లిపోయిన గుడ్లు, పలుమార్లు వాడిన వంటనూనె వంటి నాసిరకం పదార్థాలతో ఆహారం తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ యూనిట్‌లో అపరిశుభ్ర పరిస్థితుల్లో సమోసాలు, ఇతర ఫుడ్ ఐటమ్స్ తయారు చేసి నగరంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు తేలింది.

South Korea: డేజియోన్ కారు ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 10 మంది మృతి.. 59కి తీవ్రగాయాలు

దాడి సమయంలో సుమారు రూ.5 లక్షల విలువైన నాసిరకం ఆహార పదార్థాలు, ముడి సరుకులు, యంత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో వివిధ రకాల సమోసాలు, మైదా, స్వీట్ కార్న్ వంటి ముడి పదార్థాలు కూడా ఉన్నాయి. నిందితుడు అబ్దుల్ రషీద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేశారు. హైదరాబాద్ సిటీ పోలీసులు ఆహార కల్తీపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఇవ్వాలని సూచించారు. హోటళ్లకు సరఫరా చేసే ఆహార పదార్థాల నాణ్యతపై కఠినంగా పర్యవేక్షణ కొనసాగిస్తామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.