Food Adulteration: కుల్సుంపురాలో ఫుడ్ స్కాం బట్టబయలు.. కుళ్లిన పదార్థాలతో భారీగా సమోసాలు తయారీ..!
- హైదరాబాద్ కుల్సుంపురాలో భారీ ఫుడ్ స్కాం బట్టబయలు
- కుళ్లిన పదార్థాలతో సమోసాలు, పఫ్స్ తయారీ
- ప్రముఖ హోటళ్లకు సరఫరా చేస్తున్న నిందితుడు
- అబ్దుల్ రషీద్ (73) అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
- H-FAST, టాస్క్‌ఫోర్స్, పోలీసులు సంయుక్త దాడులు
- రూ.5 లక్షల విలువైన నాసిరకం పదార్థాల స్వాధీనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Food Adulteration: హైదరాబాద్ లోని కుల్సుంపురా ప్రాంతంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కుళ్లిపోయిన పదార్థాలతో సమోసాలు, పఫ్స్ తయారు చేసి నగరంలోని ప్రముఖ హోటళ్లకు సరఫరా చేస్తున్న నిందితుడిని అధికారులు అరెస్ట్ చేశారు. అబ్దుల్ అనే వ్యక్తి అపరిశుభ్ర వాతావరణంలో నాసిరకం పదార్థాలతో ఆహారం తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. ముఖ్యంగా కుళ్లిపోయిన గుడ్లతో ఎగ్ పఫ్స్ తయారు చేసి హోటళ్లకు పంపిస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు దాడులు నిర్వహించారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో పాడైన, నాసిరకం ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. HFAST అధికారులు కేసు నమోదు చేసి అబ్దుల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనతో కుల్సుంపురా ప్రాంతంలో తయారవుతున్న ఫుడ్ ఐటమ్స్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండలని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను హైదరాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో అపరిశుభ్ర పరిస్థితుల్లో తయారవుతున్న ఆహారం కనపడుతుంది. హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలేన్స్ టీం (H-FAST), టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, కులసుంపుర పోలీస్ సమన్వయంతో ఈ దాడి చేపట్టారు.
విశ్వసనీయ సమాచారం ఆధారంగా నిర్వహించిన ఈ దాడిలో 73 ఏళ్ల అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా సమోసాల తయారీ యూనిట్ నిర్వహిస్తున్నట్లు బయటపడింది. అతనికి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSAI) లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ ఏదీ లేకపోవడం గమనార్హం. దర్యాప్తులో భాగంగా కుళ్లిపోయిన గుడ్లు, పలుమార్లు వాడిన వంటనూనె వంటి నాసిరకం పదార్థాలతో ఆహారం తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ యూనిట్‌లో అపరిశుభ్ర పరిస్థితుల్లో సమోసాలు, ఇతర ఫుడ్ ఐటమ్స్ తయారు చేసి నగరంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు తేలింది.
South Korea: డేజియోన్ కారు ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 10 మంది మృతి.. 59కి తీవ్రగాయాలు
దాడి సమయంలో సుమారు రూ.5 లక్షల విలువైన నాసిరకం ఆహార పదార్థాలు, ముడి సరుకులు, యంత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో వివిధ రకాల సమోసాలు, మైదా, స్వీట్ కార్న్ వంటి ముడి పదార్థాలు కూడా ఉన్నాయి. నిందితుడు అబ్దుల్ రషీద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేశారు. హైదరాబాద్ సిటీ పోలీసులు ఆహార కల్తీపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఇవ్వాలని సూచించారు. హోటళ్లకు సరఫరా చేసే ఆహార పదార్థాల నాణ్యతపై కఠినంగా పర్యవేక్షణ కొనసాగిస్తామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
An illegal food manufacturing unit engaged in the large-scale preparation of samosas under grossly unhygienic conditions was successfully busted by the Hyderabad Food Adulteration Surveillance Team (H-FAST) of the Task Force, in coordination with Kulsumpura Police, on 20.03.2026… pic.twitter.com/NnOHOyq56d
— Hyderabad City Police (@hydcitypolice) March 21, 2026
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!