Florida Woman: ప్లీస్ హెల్ప్ అంటూ పిజ్జా ఆర్డర్.. రంగంలోకి పోలీసులు.. కథ అంతా బాయ్ ఫ్రెండ్ చుట్టూ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Florida Woman: ఆపదలో ఉన్నప్పుడు మనకు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనల్ని మనం కాపాడుకోవడానికి ఎవరు ఆలోచించని విధంగా వినూత్నంగా ఆలోచిస్తూ ఉంటాం. ఇక ఫ్లోరిడాలో ఆపదలో ఉన్న ఓ మహిళ కూడా డిఫరెంట్ గా ఆలోచించి తనతో పాటు తన ఇద్దరి పిల్లలను కూడా రక్షించుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఫ్లోరిడాకు చెందిన చెరిల్ ట్రెడ్‌వే అనే మహిళను తన ఇద్దరి పిల్లలతో సహా ఆమె బాయ్ ఫ్రెండ్ ఈతాన్ ఎర్ల్ నికెర్సన్ బంధించాడు. వారిని అనేక చిత్రహింసలకు గురిచేశాడు. అయితే అతని బారి నుంచి తప్పించుకోవడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా వీలుకాకపోవడతో చెరిల్ కు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. వెంటనే తాను పిజ్జా ఆర్డర్ చేసుకుంటానని ప్రియుడిని కత్తితో బెదిరించి ఫోన్ లాక్కోని పిజ్జా హట్ నుంచి ఆర్డర్ పెట్టుకుంది.
Also Read: Uttarpradesh: ఉత్తరప్రదేశ్ లో దారుణం.. ముస్లిం బాలుడిని హిందూ పిల్లలతో కొట్టించిన టీచర్
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
అయితే ఇక్కడే ఆ మహిళ తన తెలివితేటలను ఉపయోగించింది. ఎవరికి రాని ఐడియాతో పోలీసులకు తాము బంధిగా ఉన్నామన్న విషయాన్ని తెలియజేసింది. పెప్పరోనితో పాటు స్మాల్ క్లాసిక్ పిజ్జాను ఆర్డర్ చేసిన ఆమె పిజ్జా హట్ సిబ్బందికి.. పోలీసు అధికారుల సహాయం కావాలని మెసేజ్ చేసింది. ‘ప్లీజ్ హెల్ప్, గెట్ 911 టు మీ’ అని ఆ మహిళ నోట్ లో పేర్కొంది. దీంతో పిజ్జా యాప్ అధికారులు పోలీసులకు సమాచారం అందించగా వారు చెరిల్ తో పాటు ఆమె ఇద్దరు పిల్లలను కూడా రక్షించారు. అంతేకాకుండా పోలీసులు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. ఇక విషయం పై స్పందిస్తూ తాను 28 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానని ఇంతవరకు ఇలాంటి ఉదంతం ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు రెస్టారెంట్ మేనేజర్. ఏదేమైనా వారు సురక్షితంగా తప్పించుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పిజ్జా యాప్ తో ఇలా చేయొచ్చని ఇంత వరకు తెలియదు అంటూ ఒకరు కామెంట్ చేయగా, పిజ్జా డెలివరీ బాయ్ కు బదులు పోలీసులు డైరెక్ట్ గా సీన్ లోకి ఎంటర్ అయ్యింటే బాగుండేదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఆమె తెలివికి మాత్రం అందరూ వావ్ అంటున్నారు.
In 2015, a Florida woman named Cheryl Treadway was held hostage by her boyfriend, but she convinced him to let her order a pizza using the Pizza Hut app. In the space for special request, she wrote' "Please help. Get 911 to me. 911 hostage help!" Police arrived at the location… pic.twitter.com/LkmSKRAWPW
— Morbid Knowledge (@Morbidful) August 25, 2023
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!