NTV Telugu Site icon

Delhi Floods: బీజేపీ కుట్రల వల్లే ఢిల్లీలో వరదలొచ్చాయి..

Aap

Aap

గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తరభారతదేశం అతలాకుతలం అవుతుంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలు వరద ప్రవాహానికి మునిగిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఈ వర్షాల కారణంగా యమునా నదిలో నీటిమట్టం రికార్డు స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం వరద ప్రవాహం కొంత తగ్గుముఖం పట్టింది. అయితే ఢిల్లీలో వరదలు రావడం వెనుక భారతీయ జనతా పార్టీ కుట్ర ఉందని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు చేస్తుంది. బీజేపీ పేరు ఎత్తకుండా హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి దేశ రాజధానికి అదనపు నీటిని విడుదల చేయడం వల్ల ఢిల్లీని ముంచేసే కుట్ర జరిగిందని ఆప్ సర్కార్ ఆరోపించింది.

Read Also: Jogi Ramesh: ఒకడు వృద్ధ సైకో, మరొకడు పిల్ల సైకో, ఇంకొకడు అసలైన సైకో.. మంత్రి జోగి రమేష్ ఘాటు వ్యాఖ్యలు

వరద పరిస్థితి నగరాన్ని ముంచేసే కుట్ర జరుగుతుందని ఢిల్లీ నీటిపారుదల, వరద నియంత్రణ మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు. ఢిల్లీని ఉద్దేశపూర్వకంగానే ముంచుతున్నారు.. హత్నికుండ్ బ్యారేజీ నుంచి అదనపు నీటిని ఢిల్లీ వైపుకు మళ్లించారు.. సుప్రీంకోర్టుతో సహా ఢిల్లీలోని అన్ని ముఖ్యమైన సంస్థలను ముంచడానికి కుట్ర జరిగిందని అన్నాడు. బ్యారేజీ నుంచి అదనపు నీటిని హర్యానాలోని పశ్చిమ కాలువకు, ఉత్తరప్రదేశ్‌లోని తూర్పు కాలువకు విడుదల చేయడం లేదని ఢిల్లీ నీటిపారుదల మంత్రి పేర్కొన్నారు.

Read Also: Krithi Shetty : మత్తెక్కించే చూపులతో రెచ్చగొడుతున్న కృతి శెట్టి..

యమునా నదిలో నీరు తగ్గుముఖం పడుతుంది. మరో 12 గంటల్లో ఢిల్లీ ప్రజలకు ఉపశమనం లభించనుంది. హత్నీకుండ్ బ్యారేజీ నుంచి మొత్తం నీటిని కావాలనే ఢిల్లీ వైపుకి విడుదల చేశారని ఆప్ సర్కార్ ఆరోపిస్తుంది. మరో వైపుకు ఒక్క చుక్క నీటిని కూడా విడుదల చేయలేదు.. అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్, హర్యానాకు కాల్వలు వెళ్తున్నాయి. దీనికి హర్యానా ప్రభుత్వం సమాధానం చెప్పాలి.. ఇలా చేయడం వల్ల ఢిల్లీలో వరద పరిస్థితిని ఎలా నివారించగలం? అని మంత్రి సౌరభ్ అన్నారు.

Read Also: Dakshin Ke Badrinath: హైదరాబాద్‌లో కొలువైన బద్రీనాథుడు.. ఈ ఆధ్యాత్మిక ప్రదేశం గురించి మీకు తెలుసా?

ఢిల్లీకి వరదను బీజేపీ తెచ్చిన విపత్తని ఆప్ నాయకుడు సోమనాథ్ భారతి అన్నారు. కాగా, ఆప్ ఆరోపణలపై బీజేపీ గట్టిగానే బదులు ఇస్తోంది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో చేసినట్లుగా, వరదల నుంచి ఆప్ తప్పించుకోవాలని చూస్తోందని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా అన్నారు. నీటిని విడుదల చేసినప్పుడు మొదట ఢిల్లీ, ఆగ్రా, అలహాబాద్ గుండా వెళ్లి.. అనంతరం సముద్రంలో కలుస్తుందని హర్యానా వ్యవసాయ మంత్రి జై ప్రకాష్ దలాల్ అన్నారు. నగరంలో చాలా ప్రాంతాలు నీటమునిగి పోవడానికి మూలకారణం అక్రమ ఆస్తులు, ముంపు ప్రాంతాలలో నిర్మాణాలేనని ఆయన విమర్శించారు.