కృతి శెట్టి.. ఈ భామ ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది..మొదటి చిత్రంతోనే ఈ భామ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ‘బేబమ్మ’ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించింది..తన నటనతో అందరినీ మెప్పించింది.దీంతో తెలుగులో ఈ భామకు వరుస ఆఫర్లు వచ్చాయి.ఉప్పెన సినిమా తరువాత ఈభామ ‘శ్యామ్ సింగరాయ్’ మరియు ‘బంగార్రాజు’ వంటి చిత్రాలలో నటించి హ్యాట్రిక్ విజయం అందుకుంది.. అయితే ఆ తర్వాత నుంచి ఈ అమ్మడికి అస్సలు కలిసి రావడం లేదు.చేసిన ప్రతీ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచాయి.రీసెంట్ గా విడుదల అయిన ‘కస్టడీ’ సినిమా కూడా కృతి శెట్టి కి ఆశించిన ఫలితం అందించలేకపోయింది. దీనితో ఈ భామకు ఆఫర్లూ తగ్గుతూ వచ్చాయి.
ప్రస్తుతం ఈ భామ కోలీవుడ్ లో జయం రవి నటిస్తున్న ‘జీనీ’ చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక అయింది.సినిమాల లో కాకుండా ఈ భామ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ తన ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతుంది.ఇటీవల ఈ భామ వరుసగా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది.ప్రస్తుతం ఈ భామకు ఇంస్టాగ్రామ్ లో 6 మిలియన్ల ఫాలోవర్స్ వున్నారు..తాజాగా ఈ బ్యూటీ గ్రీన్ డ్రెస్ లో దిగిన ఫోటోలను షేర్ చేసింది. వాటిలో తన కిల్లింగ్ లుక్స్ తో రెచ్చగొడుతుంది.స్లిమ్ ఫిట్ అందాలతో యూత్ ని తెగ అట్రాక్ట్ చేస్తుంది.. కృతి శెట్టి లేటెస్ట్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆ లుక్స్ కి లైక్స్ మరియు కామెంట్స్ చేస్తున్నారుఈ భామకు ఉప్పెన సినిమా తరువాత ఆ స్థాయి హిట్ లభించలేదు. వరుస ప్లాప్స్ వల్ల అవకాశాలు కూడా తగ్గుతున్నాయి. ఇలాంటి సమయంలో సోషల్ మీడియానే నమ్ముకుంది ఈ భామ. మరీ ఈ అమ్మడి కెరీర్ తను అనుకున్న విధంగా సాగుతుందో లేదో చూడాలి.