Dakshin Ke Badrinath: హైదరాబాద్‌లో కొలువైన బద్రీనాథుడు.. ఈ ఆధ్యాత్మిక ప్రదేశం గురించి మీకు తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dakshin Ke Badrinath Bhakti Tv Video: హిందువులలో చాలా మందికి ఎక్కడో ఉన్న బద్రీనాథ్ వెళ్లాలని ఉంటుంది. కానీ వయసు సహకరించకో, ఆరోగ్య సమస్యల వలనో లేక ఆర్ధిక ఇబ్బందులు కారణంగానో అక్కడ దాకా వెళ్లలేకపోతున్నారు. అలంటి వారికోసం ఆ బద్రినాథుడు హైదరాబాద్‌కు వచ్చేశారని అంటే నమ్ముతారా? నమ్మక పోయినా అదే నిజమండీ హైదరాబాద్ దగ్గరలో నూతన బద్రీనాథ్ ఆలయం నిర్మించారు. ఉత్తరాఖండ్ లో ప్రసిద్ధి చెందిన బద్రీనాథ్ ఆలయానికి ఒక రెప్లికాలాగా ఈ హైదరాబాద్ బద్రీనాథ్ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి 40 కి.మీ దూరంలో మేడ్చల్ జిల్లా, బండమైలారం అనే చిన్న గ్రామంలో నిర్మించబడింది. జూన్ 29న ఓపెన్ అయిన ఈ ఆలయాన్ని దక్షిణ్ కే బద్రీనాథ్ అని పిలుస్తున్నారు. ఈ ఆలయంలో కొద్దిరోజుల నుంచి నుంచి బద్రీనాధుడు పూజలు అందుకుంటున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయంలో బద్రీనాథ్ క్షేత్రంలో చేసే పూజా విధానాన్ని అవలంబిస్తున్నారు.
Minister RK Roja: పవన్ కళ్యాణ్‌కి ఫ్యాన్స్ ఉంటే, జగన్‌కు సైన్యముంది.. మంత్రి రోజా కౌంటర్
Also Read
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
- Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
- Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
- Vinayaka Vrata Katha: 'వినాయక చవితి' నాడు విజ్ఞాలను తొలిగించే 'వినాయక వ్రత కథ' మీకోసం..!
ఇక దాదాపు 30,000 మంది NGO సభ్యులతో ఉత్తరాఖండ్ కళ్యాణకారి సంస్థ ఈ ఆలయాన్ని 1,550 చదరపు గజాలలో నిర్మించిగా ఈ నిర్మాణం కోసం విరాళాల ద్వారా దాదాపు కోటి రూపాయలు స్వీకరించినట్లు సభ్యులు చెబుతున్నారు. నిజానికి ఉత్తరాఖండ్‌లో ఉన్న బద్రీనాథ్ ఆలయం సంవత్సరానికి నాలుగు నెలలు (మే నుండి జూన్, సెప్టెంబర్ నుండి అక్టోబర్) మాత్రమే తెరిచి ఉంటుంది కానీ మన ఈ దక్షిణ్ కే బద్రీనాథ్ ఆలయం సంవత్సరం పొడవునా తెరిచి ఉంటుంది. ఈ దక్షిణ్ కే బద్రీనాథ్ ఆలయంలోని ప్రతిమలు అసలు బద్రీనాథ్ ఆలయంలో ఎలా ఉన్నాయో అలాగే ప్రతిష్టించడమే కాదు ఆ ఆలయంలో ఉన్న అఖండ దీపాన్ని సైతం బద్రీనాథ్ నుంచి తీసుకొచ్చారు. మరి అలాంటి దేవాలయం గురించి మా భక్తి ఛానల్ చేసిన స్పెషల్ వీడియో మీరు కూడా చూసేయండి మరి.
తాజావార్తలు
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?