Discounts on Smart TV’s in Flipkart: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో ప్రస్తుతం ‘గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్’ నడుస్తోంది. ఈ సేల్ సెప్టెంబర్ 10 నుంచి 16వ తేదీ వరకు కొనసాగనుంది. 7 రోజుల పాటు కొనసాగే ఈ సేల్‌లో హోమ్ అప్లియెన్సెస్‌పై 75 శాతం వరకు డిస్కౌంట్స్ ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. దాంతో 4K స్మార్ట్ టీవీలు, ఏసీ, గీజర్, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్ లాంటి వాటిని కస్టమర్లు సగం ధరకే సొంతం చేసుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్‌లో శాంసంగ్, సోనీ, ఎంఐ, థామ్సన్, వియూ వంటి బ్రాండ్‌ల స్మార్ట్ టీవీలను భారీ డిస్కౌంట్‌తో అందిస్తున్నారు. అంతేకాకుండా బ్యాంకు, ఎక్స్‌ఛేంజ్‌ఆఫర్ యొక్క బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. శాంసంగ్ క్రిస్టల్ విజన్ 4K ఐస్‌స్మార్ట్ సిరీస్ 43 ఇంచ్ (SAMSUNG Crystal Vision 4K iSmart Series 108 cm) టీవీపై 34% తగ్గింపు ఉంది. కస్టమర్లు ఈ టీవీని రూ. 54,900కి బదులుగా రూ. 35,990కి కొనుగోలు చేయవచ్చు. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ఆఫర్ కింద అదనంగా మరో రూ. 4,400 తగ్గింపు ఉంటుంది.
ఎంఐ ఏ సిరీస్ 32 ఇంచ్ హెచ్‌డీ రెడీ ఎల్‌ఈడీ స్మార్ట్ గూగుల్ టీవీ 2023 ఎడిషన్‌ను రూ. 24,999కి బదులుగా రూ. 12,499కి కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీపై 50% తగ్గింపు ఉంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కింద ఈ టీవీపై రూ. 1,400 తగ్గింపు కూడా ఉంది. అలానే ఎంఐ ఏ సిరీస్ 40 ఇంచెస్ టీవీపై 28% తగ్గింపు ఉంది. ఈ టీవీని రూ. 29,999కి బదులుగా రూ. 21,499కే కొనుగోలు చేయవచ్చు. దీనిపై రూ. 1400 ఎక్స్‌ఛేంజ్ బోనస్ ఉంది. స్మార్ట్ టీవీలను కొనాలనుకునే వారు ఫ్లిప్‌కార్ట్‌ను ఓసారి ఓపెన్ చేసి చూస్తే బెటర్.