Free Flight Tickets: విమాన టిక్కెట్లు ఫ్రీగా ఇస్తాం.. మా దేశం వచ్చిపోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Free Flight Tickets: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం తలకిందులైంది. పలు దేశాల్లోని ప్రజల జీవన స్థితిగతులు మారిపోయాయి. ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. పర్యాటక రంగంపైనే పూర్తిగా ఆధారపడిన హాంకాంగ్ పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిద్ కారణంగా కుదేలయిన పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు విదేశీ పర్యాటకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దాదాపు 5లక్షలు ఉచితంగా ఫ్లైట్ టికెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పర్యాటక ప్రచార కార్యక్రమం ‘హలో హాంకాంగ్’ ప్రారంభిస్తూ 5 లక్షల ఫ్లైట్ టికెట్లు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. ఈమేరకు హాంకాంగ్ విమానయాన సంస్థలు గురువారం ప్రకటన విడుదల చేశాయి. ఈ పథకంలో భాగంగా తమ దేశాన్ని సందర్శించాలనుకున్న పర్యాటకులకు వన్ ప్లస్ వన్ పద్ధతిలో టికెట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. లక్కీ డ్రా విధానంలోనూ ఈ ఉచిత టికెట్లను గెలుచుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. మార్చి నుంచి సెప్టెంబర్ వరకు విడతల వారీగా ఉచిత టికెట్లను పంపిణీ చేస్తామని వివరించారు.
Read Also: Workers Strike : అట్టుడుకుతున్న బ్రిటన్.. వేతనాల కోసం రోడ్డెక్కిన లక్షలాది మంది
Also Read
- Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
- Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
టికెట్లతో పాటు పలు కూపన్లు, క్యాష్ వోచర్లను గెలుచుకునే అవకాశంకూడా ఉందన్నారు. ఉచిత విమాన టికెట్ల కోసం హాంకాంగ్ ఎయిర్ లైన్స్ సంస్థలు ఏకంగా 2 బిలియన్ హాంకాంగ్ డాలర్లు (మన కరెన్సీలో రూ.2,100 కోట్లు) ఖర్చుచేస్తున్నాయి. భారతీయులకు కూడా ఉచిత టికెట్ల ఆఫర్ వర్తిస్తుందని, మార్చిలో ఇండియా, సౌత్ ఈస్ట్ ఆసియా పౌరులకు టికెట్లు కేటాయిస్తామని హాంకాంగ్ విమానయాన సంస్థల ప్రతినిధి వెల్లడించారు. ఆ తర్వాత ఏప్రిల్ లో చైనా పౌరులకు, మే నెలలో నార్త్ ఈస్ట్ ఆసియా తో పాటు ఇతర దేశాల పౌరులకు టికెట్లు కేటాయిస్తామని వివరించారు. జులైలో తమ దేశ పౌరులకు కూడా ఈ ఆఫర్ ను వర్తింపజేస్తామని తెలిపారు. అయితే, ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను హాంకాంగ్ విమానయాన సంస్థలు ఇంకా వెల్లడించలేదు.
Read Also:Nizamabad Crime: బెంచీ మీద కూర్చునే విషయంపై విద్యార్థుల మధ్య గొడవ.. ఛాతీపై బలంగా..
తాజావార్తలు
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?