Promotions: కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఏపీకి చెందిన ఆ ఐదుగురికి IASలుగా పదోన్నతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు నాన్-స్టేట్ సివిల్ సర్వీస్ (Non-SCS) అధికారులకు ఐఏఎస్‌లు (IAS)గా పదోన్నతి లభించింది. 2024 సెలెక్ట్ లిస్ట్ ఆధారంగా వీరికి ఐఏఎస్ హోదా కల్పిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అధికారులందరినీ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఐఏఎస్‌లుగా ఎంపికైన అధికారులు వీరే..
ప్రభుత్వం విడుదల చేసిన జాబితా ప్రకారం.. ప్రభల గోపినాథ్, గుడిశ బాలకృష్ణ, ఎం. జయకృష్ణ, ఏ.ఏ.ఎల్. పద్మావతి, మరియు డాక్టర్ మామిళ్లపల్లి వరప్రసాద్‌లు ఐఏఎస్ అధికారులుగా పదోన్నతి పొందారు. వీరంతా వివిధ ప్రభుత్వ శాఖలలో సుదీర్ఘ కాలం పాటు నాన్-స్టేట్ సివిల్ సర్వీస్ అధికారుల విభాగంలో విశేష సేవలు అందించారు. వారి పనితీరు, సీనియారిటీ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన సిఫార్సులను పరిశీలించిన కేంద్ర నియామకాల కమిటీ, తుది జాబితాను ఖరారు చేసింది.
Also Read
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
పాలనలో మరింత వేగం..
రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల కొరతను అధిగమించడానికి , పరిపాలనను మరింత బలోపేతం చేయడానికి ఈ పదోన్నతులు ఎంతగానో దోహదపడతాయని సచివాలయ వర్గాలు పేర్కొన్నాయి. వివిధ శాఖల్లో క్షేత్రస్థాయిలో అపారమైన అనుభవం ఉన్న ఈ నాన్-స్టేట్ సివిల్ సర్వీస్ అధికారులు ఐఏఎస్‌లుగా బాధ్యతలు చేపట్టడం వల్ల ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు సేవలందిచడంలో మరింత పారదర్శకత, వేగం పెరుగుతుందని భావిస్తున్నారు. త్వరలోనే వీరికి రాష్ట్ర ప్రభుత్వం నూతన పోస్టింగులను కేటాయించనుంది. పదోన్నతి పొందిన అధికారులకు పలువురు సహచర అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.
తాజావార్తలు
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
-
Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
-
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
-
Impure : పెళ్లి కూతురు ‘కన్య’ కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఇంప్యూర్’!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!