NTV Telugu Site icon

Breaking: ఎయిర్‌ షో ఘటనలో ఐదుకు చేరిన మృతుల సంఖ్య..

Chennai

Chennai

చెన్నైలోని మెరీనా బీచ్‌ దగ్గర ఎయిర్‌ షో తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఎయిర్‌ షో చూసేందుకు జనం పోటెత్తారు. దీంతో.. మెరీనా బీచ్ మొత్తం జనసంద్రంగా మారింది. బీచ్ కు వచ్చే రోడ్లు, మెట్రో రైళ్లు కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలోనే మెరీనా బీచ్ రైల్వే స్టేషన్ దగ్గర జరిగింది. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. డీహైడ్రేషన్ కారణంగా దాదాపు 265 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వేడి వాతావరణం కారణంగా కొంతమంది అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులను శ్రీనివాసన్ (48), కార్తికేయన్ (34), జాన్ బాబు (56), దినేష్‌గా గుర్తించారు. IAF తన 92వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. 15 లక్షల మందికి పైగా ప్రజలు రైలు, మెట్రో, కార్లు మరియు బస్సుల ద్వారా వేదిక వద్దకు చేరుకుని ప్రదర్శనను వీక్షించారు. సాయంత్రం 4.30 గంటల వరకు దాదాపు మూడు లక్షల మంది పైగా లోకల్ ట్రైన్స్ లో ప్రయాణించనట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

Read Also: Mukesh Kumar Meena: అక్టోబరు 15 నుండి ఇసుక డిమాండ్కు అనుగుణంగా లభ్యత..

ఎయిర్ షో ఘటనలో ఐదుగురు మృతి చెందడంపై మాజీ ముఖ్యమంత్రి పళణి స్వామి తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఐదు మంది చనిపోయారని అన్నారు. కనీస భద్రత ఏర్పాట్లు చేయకుండా అన్ని లక్షల మందిని ఎయిర్ షోకు అనుమతించారు. కనీసం ప్రజలకు తాగునీరు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఎందుకు ఉండాలి.. చనిపోయిన కుటుంబాలకు ఏఐడీఎంకే అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Show comments