TGSRTC : ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడికి ఫిట్స్.. డ్రైవర్ ఉదారత
- బస్సులోనే ఆస్పత్రికి తీసుకెళ్లిన డ్రైవర్
- మానవత్వం చాటిన డ్రైవర్‌కి టీజీఎస్ఆర్టీసీ సన్మానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీజీఎస్ఆర్టీసీ బస్సులో ఫిట్స్ వచ్చిన ప్రయాణికుడిని ఆస్పత్రిలో చేర్పించి డ్రైవర్ ఉదారత చాటుకున్నారు. బస్సును నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రయాణికుడి ప్రాణాలను కాపాడారు. వరంగల్-2 డిపోనకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు హైదరాబాద్ నుంచి హన్మకొండకు సోమవారం వెళ్తోంది. హైదరాబాద్ శివారు ఘట్ కేసర్ దాటగానే సంతోష్ అనే ప్రయాణికుడికి బస్సులో ఒక్కసారిగా ఫిట్స్ వచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన తోటి ప్రయాణికులు డ్రైవర్ బి.వెంకన్న దృష్టికి తీసుకెళ్లారు. వెంటేనే బస్సును పక్కకి ఆపి ఫిట్స్ వచ్చిన ప్రయాణికుడిని డ్రైవర్ పరిశీలించారు. ఆరోగ్య పరిస్థితి విషమిస్తుందని గుర్తించి.. తోటి ప్రయాణికుడు శ్రీనివాస్ సహకారంతో సమీపంలో ఉన్న బీబీనగర్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రికి బస్సును తీసుకెళ్లారు. సంతోష్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకువెళ్లడంతో సంతోష్ కు ప్రాణాప్రాయం తప్పింది.
Mars: అంగాకరకుడి ఉపరితలం కింద నీరు..? ఇన్‌సైట్ ల్యాండర్ కీలక డేటా..
Also Read
- Mohan Bhagwat: "నేటి తరం దారి తప్పలేదు".. సీజేపీ నిరసనల వేళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
- Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ 'మనీ రూల్స్'.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
- CJP Protest: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా?.. కేంద్రానికి CJP డెడ్‌లైన్.. ఢిల్లీలో హై అలర్ట్!
- ఏపీలో SIR పూర్తి.. 44.71 లక్షల ఓటర్లు 'అన్ కలెక్టబుల్'గా గుర్తింపు.. తుది ఓటరు జాబితా విడుదల అప్పుడే.!
సమయస్పూర్తితో వ్యవహారించి .. సకాలంలో ప్రయాణికుడిని ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆర్టీసీ డ్రైవర్ బి.వెంకన్నను హైదరాబాద్ బస్ భవన్ లో మంగళవారం టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి ఆయనను టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ సన్మానించారు. ఆపద సమయంలో అమూల్యమైన సేవాతర్పరతను ఆర్టీసీ సిబ్బంది చాటుతున్నారని సజ్జనర్ అన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు.. వారి ఆపద సమయంలో తాము ఉన్నామని భరోసా కల్పిస్తున్నారని ప్రశంసించారు. సంతోష్‌ను ఆస్పత్రికి తరలించడంలో డ్రైవర్‌కి సహకరించిన ప్రయాణికుడు శ్రీనివాస్‌కు, వైద్యం అందించిన ఎయిమ్స్ వైద్య బృందానికి అభినందనలు తెలియజేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీదేవి, వరంగల్-2 డిపో మేనేజర్ జ్యోస్న, తదితరులు పాల్గొన్నారు.
Masthan Sai : అసభ్యంగా ఫోటోలు, వీడియోలు.. మస్తాన్ సాయి కేసులో సంచలన విషయాలు
తాజావార్తలు
-
Jyothika: ఇక చాలు.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. జ్యోతిక సంచలన పోస్ట్!
-
Soft Foods for Seniors: దంతాలు లేని వారికి ఏ ఆహారం మంచిది? సులభంగా తినగలిగే పోషకాహారాల పూర్తి జాబితా
-
Salman Khan: ట్రోల్స్‌కు సిక్స్‌ప్యాక్‌తో సమాధానం.. 60 ఏళ్లకూ సల్మాన్ స్టామినా ఇదే!
-
Mohan Bhagwat: “నేటి తరం దారి తప్పలేదు”.. సీజేపీ నిరసనల వేళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
-
Samsung Galaxy F70 Pro: సామ్ సంగ్ గెలాక్సీ F70 ప్రో.. 6000mAh బ్యాటరీ, Snapdragon 6 Gen 3 చిప్సెట్
ట్రెండింగ్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!