Huawei To Release First Tri Folding Phone: మొబైల్ కంపెనీలు ట్రెండ్‌కు తగ్గట్టుగా కొత్త కొత్త ఫోన్లను తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం టెక్ మార్కెట్‌లో ఫోల్డబుల్ ఫోన్‌లకు మంచి క్రేజ్ ఉంది. అయితే ట్రై ఫోల్డబుల్ ఫోన్ లాంచ్‌కు కొన్ని కంపెనీలు సన్నద్ధమవుతున్నాయి. ట్రై ఫోల్డబుల్ మొబైల్‌ను తీసుకొచ్చేందుకు అనేక మొబైల్ సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ విభాగంలో మొబైల్‌ను లాంచ్ చేయనున్నట్లు ఇప్పటికే టెక్నో మొబైల్స్ ప్రకటించినా.. చైనాకు చెందిన ‘హువావే’ ముందుగా ట్రై ఫోల్డ్ మొబైల్‌ను లాంచ్ చేస్తోంది.
Also Read: Jio Recharge Offers: జియో ఎనిమిదో వార్షికోత్సవం.. ఈ రీఛార్జ్‌లపై 700 విలువ చేసే ప్రయోజనాలు!
ట్రై ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్లు హువావే కంపెనీ సీఈఓ రిచర్డ్‌యి తాజాగా తెలిపారు. ‘హువావే మేట్ ఎక్స్‌టీ’ పేరుతో సెప్టెంబర్ 10న చైనా మార్కెట్‌లో రిలీజ్ కాబోతోంది. ఇందులో రెండు ఇన్‌వర్డ్ స్క్రీన్‌లు, ఒక అవుట్‌వర్డ్ స్క్రీన్ ఉంటాయి. డ్యూయల్ హింజ్ మెకానిజమ్‌తో దీనిని రూపొందించారు. హువావే 70 సిరీస్‌లో భాగంగా ఈ మొబైల్‌ను లాంచ్ చేస్తున్నారు. ఈ ఫోన్ ధర రూ.3,35,000గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. టెక్నో కూడా ట్రై ఫోల్డబుల్ ఫోన్‌పై పనిచేస్తోంది. అయితే ఈ ఫోన్లు మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తాయో ఇంకా తెలియరాలేదు.