NTV Telugu Site icon

CWC Meeting: రేపు సీడబ్ల్యూసీ తొలి సమావేశం.. పలు అంశాలపై చర్చ

Cwc

Cwc

కాంగ్రెస్ నూతన వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తొలి సమావేశం శనివారం హైదరాబాద్‌లోని తా‌జ్‌​కృష్ణాలో నిర్వహించనున్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ వ్యూహం, విపక్షాల కూటమి (INDIA), రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. అంతేకాకుండా.. ‘భారత్ జోడో యాత్ర’ రెండో దశపై కూడా ఈ వర్కింగ్ కమిటీలో చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 17న విస్తృత వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వర్కింగ్ కమిటీ సభ్యులందరితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పలువురు సీనియర్ నేతలు పాల్గొననున్నారు. ఈ సమావేశం అనంతరం తుక్కుగూడలో నిర్వహించే ‘విజయభేరి’ బహిరంగ సభలో పాల్గొననున్నారు.

Nipah Virus: కేరళలో మరో నిపా కేసు.. డేంజర్ అంటున్న వైద్యులు..!

ఈ సమావేశంలోనే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ తీసుకునే నిర్ణయాలను చర్చించనున్నారు. ఇండియా కూటమితో అనుసరించే వ్యూహాలు, తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలతో పాటు పార్లమెంట్‌ ఎన్నికలు లేదంటే జమిలి ఎన్నికలు వస్తే ఎలా వ్యవహారించాలనే అంశాలపైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రెండో రోజు ఉదయం నుంచి మధ్యాహ్నాం వరకు సీడబ్ల్యూసీ విస్తృతస్థాయి సమావేశానికి సీడబ్ల్యూసీ సభ్యులతో పాటు పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు, ఏఐసీసీ ప్రధానకార్యదర్శులు, ఏఐసీసీ కార్యదర్శులు, కేంద్ర మాజీ మంత్రుల, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులతో పాటు పార్టీ సీనియర్లు పాల్గొననున్నారు. మొదటి రోజు తీసుకున్న నిర్ణయాలతో పాటు, అదనంగా మరికొన్ని అంశాపై చర్చిస్తారని పార్టీ వర్గాల మేరకు తెలుస్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక పరిస్థితి, చైనా సరిహద్దులో ఉద్రిక్తత, అవినీతి ఆరోపణలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహంపై కూడా చర్చించవచ్చని పార్టీ వర్గాల సమాచారం.

Mahadev Gambling App: UAEలో పెళ్లి కోసం రూ. 200 కోట్ల ఖర్చు.. బట్టబయలు చేసిన ఈడీ

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీతో సహా పలువురు సీనియర్ నేతలతో పాటు.. కాంగ్రెస్ తన కార్యవర్గాన్ని ఆగస్టు 20న పునర్నిర్మించింది. కార్యవర్గంలో 39 మంది సభ్యులు, 32 మంది శాశ్వత ఆహ్వానితులు, 13 మంది ప్రత్యేక ఆహ్వానితులను చేర్చారు. సచిన్ పైలట్, శశిథరూర్ వంటి నేతలకు తొలిసారిగా ఈ వర్కింగ్ కమిటీలో చోటు దక్కింది.