కాంగ్రెస్ నూతన వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తొలి సమావేశం శనివారం హైదరాబాద్‌లోని తాజ్కృష్ణాలో నిర్వహించనున్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ వ్యూహం, విపక్షాల కూటమి (INDIA), రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. అంతేకాకుండా.. 'భారత్ జోడో యాత్ర' రెండో దశపై కూడా ఈ వర్కింగ్ కమిటీలో చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.