Congress: కాంగ్రెస్ తొలి జాబితా విడుదల.. తెలంగాణలో ఎంతమందంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే 36 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం 4 స్థానాలకే అభ్యర్థులను ఖరారు చేసింది.
Also Read
జహీరాబాద్ – సురేశ్ షెట్కర్
చేవెళ్ల – సునీతా మహేందర్‌రెడ్డి
నల్గొండ – కుందూరు రఘువీర్‌రెడ్డి
మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్
కేవలం నలుగురి అభ్యర్థులనే అధిష్ఠానం ఖరారు చేసింది. మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే వంశీచందర్‌రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు కానీ ఆయన పేరును హోల్డ్‌లో పెట్టింది. కారణమేంటో తెలియదు.
గురువారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ల నేతృత్వంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, హర్యానా, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మణిపుర్ రాష్ట్రాల్లోని అభ్యర్థులను ఖరారు చేసే అంశంపై కసరత్తు చేసింది. ఇందులో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌మున్షీతోపాటు పార్టీ సీనియర్ నేతలు జైరాం రమేశ్, అధీర్‌రంజన్ చౌధరి, అంబికాసోని, ముకుల్‌వాస్నిక్, టీఎం సింగ్‌దేవ్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!