Mahakumbh Mela 2025 : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహిస్తున్న మహా కుంభమేళా ఇప్పుడు చివరి దశలో ఉంది. ఫిబ్రవరి 26 మహా కుంభమేళా చివరి రోజు. దీనికి ముందు, ప్రతి ఒక్కరూ మహా కుంభమేళాలో పుణ్యస్నానం చేయాలనుకుంటారు. ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు మహా కుంభమేళాకు చేరుకుంటున్నారు. మహా కుంభమేళా గురించి చాలాసార్లు తప్పుడు సమాచారం వ్యాప్తి చెందింది. తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పుడు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారు.
మహా కుంభమేళా గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేసిన 140 సోషల్ మీడియా హ్యాండిళ్లపై డజనుకు పైగా ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయబడ్డాయి. మహా కుంభమేళా గురించి తప్పుడు సమాచారాన్ని షేర్ చేసిన.. “తప్పుదారి పట్టించే కంటెంట్”ను పంచుకున్న 140 సోషల్ మీడియా హ్యాండిళ్లపై 13 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లు మహా కుంభమేళా డిఐజి వైభవ్ కృష్ణ తెలిపారు.
Read Also:YSRCP boycott Governor Speech: గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేసిన వైసీపీ..
జనం గుమిగూడే అవకాశం
ఉత్తరప్రదేశ్ పోలీసుల సోషల్ మీడియా సెల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిశితంగా పరిశీలిస్తోంది. ముఖ్యంగా త్రివేణి సంగమంలో మహిళా యాత్రికులు స్నానం చేస్తున్న వీడియోలు షేర్ అయిన తర్వాత, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై పర్యవేక్షణను కఠినతరం చేశారు. ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 26న మహా కుంభమేళా చివరి రోజున, మహాశివరాత్రి సందర్భంగా, భక్తుల రద్దీ పెరుగుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే మహా కుంభమేళాలో స్నానం చేయడానికి భక్తులు పెద్ద సంఖ్యలో రావచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, దీనికి “పూర్తి ఏర్పాట్లు” చేసినట్లు డిఐజి కృష్ణ తెలిపారు.
87 లక్షల మంది స్నానాలు
డిఐజి కృష్ణ మాట్లాడుతూ, “మహా కుంభ్ ప్రాంతంలో ఎక్కడా ట్రాఫిక్ జామ్ లేకుండా చర్యలు తీసుకుంటాము. అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరగాలి. ఎంత పెద్ద జనసమూహం ఉన్నా, మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాము. ” ప్రయాగ్‌రాజ్‌లోని గంగా, యమునా, పౌరాణిక సరస్వతి నదుల సంగమ స్థానం త్రివేణి సంగమంలో ఇప్పటివరకు 62 కోట్ల మంది యాత్రికులు పవిత్ర స్నానాలు చేశారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఆదివారం దాదాపు 87 లక్షల మంది మహా కుంభానికి చేరుకుని స్నానాలు ఆచరించారని రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ తెలిపింది.
Read Also:Urvashi Rautela: మరో బంపర్ ఆఫర్ కొట్టెసిన ఊర్వశి రౌతేలా !