హర్యానాలోని జింద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ప్యాసింజర్ రైలు కంపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగడంతో గందరగోళం నెలకొంది. రోహ్‌తక్‌లోని సంప్లా పట్టణానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. నలుగురైదుగురికి స్వల్ప కాలిన గాయాలయ్యాయి. దూకడం వల్ల కొందరు గాయపడ్డారు. మంటల కారణంగా కోచ్ మొత్తం పొగతో నిండిపోయి నల్లగా మారింది. రైల్వే సిబ్బంది ప్రయాణికుల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రభుత్వ రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి.
READ MORE: AP: పేదల ఇళ్ల నిర్మాణానికి స్థల వితరణకు ముందుకొచ్చిన ఓ వృద్ధురాలు.. సీఎం అభినందనలు
రైల్వే పోలీసుల సమాచారం ప్రకారం.. జింద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ప్యాసింజర్ రైలు సంప్లా సమీపంలోకి రాగానే ఓ కంపార్ట్‌మెంట్‌లో పేలుళ్లు సంభవించాయి. మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురై కేకలు వేశారు. చైన్ లాగి రైలును ఆపడంతో కొందరు ట్రాక్‌పైకి దూకి గాయపడ్డారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిప్రమాదంపై సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు, పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియనప్పటికీ.. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. రైలులో ఒక ప్రయాణికుడు బాణాసంచా తీసుకెళ్తున్నాడు. పేలుడు కారణంగా కంపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. పేలుడు, అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేసేందుకు ఫోరెన్సిక్ నిపుణులను రప్పించారు.
READ MORE:Maharashtra Polls: టాప్ 10 సంపన్న అభ్యర్థులు వీళ్లే! ఫడ్నవిస్ ఎన్నో స్థానంలో ఉన్నారంటే..!