హర్యానాలోని జింద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ప్యాసింజర్ రైలు కంపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగడంతో గందరగోళం నెలకొంది. రోహ్‌తక్‌లోని సంప్లా పట్టణానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. నలుగురైదుగురికి స్వల్ప కాలిన గాయాలయ్యాయి. దూకడం వల్ల కొందరు గాయపడ్డారు. మంటల కారణంగా కోచ్ మొత్తం పొగతో నిండిపోయి నల్లగా మారింది.