ఓ వైపు రోడ్డు ప్రమాదాలు.. ఓ వైపు విమాన ప్రమాదాలు, మరోవైపు రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అనుకోకుండా చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. చాలామంది గాయాలపాలవుతున్నారు. తాజాగా ఓ రైలులో మంటలు చెలరేగాయి. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వస్తున్న 127 69 నెంబర్ గల సెవెన్ హిల్స్ రైలు చిగిచెర్ల రైల్వే స్టేషన్ సమీపంలో రైలు చివరి భాగంలో గార్డు భోగి కంటే ముందు భోగి వద్ద బ్రేకులు పడి మంటలు చెలరేగాయి.
Also Read:Nani : ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్‌లో మార్పులు.. నిజమేనా?
దీంతో అందులోని ప్రయాణికులు ప్రాణ భయంతో వణికిపోయారు. కేకలు వేస్తూ గార్డుకు, లోకో పైలట్ ను అప్రమత్తం చేయడంతో రైలును నిలిపివేశారు. ప్రయాణికులు బోగీల్లోంచి కిందికి దిగారు. సకాలంలో మంటలు ఆర్పివేశారు రైల్వే సిబ్బంది. అరగంట తర్వాత రైలు సికింద్రాబాద్ కు పయనమైంది. కాగా ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఘటనపై రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు.