TTD: నిత్యం భక్తులతో రద్దీగా ఉండే తిరుపతి పట్టణంలోని గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని లావణ్య ఫొటో ఫ్రేమ్ వర్క్స్ దుకాణంలో మంటలు చెలరేగాయి. రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రమాదం జరగడం.. మంటలు ఇళ్ల వైపు వ్యాపిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గోవిందరాజస్వామి ఆలయ రథం వైపు మంటలు వస్తుండటంతో అగ్నిమాపక సిబ్బంది ఆర్పే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు మంటలు అదుపులోకి వచ్చినట్లు తెలిసింది.
Also Read: TSRTC: టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. అందుబాటులోకి ‘టీ-9 టికెట్’
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 10 ఫైరింజన్లు, 6 వాటర్ ట్యాంకులతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో పాటు గాలి వీస్తుండడంతో మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది. అగ్నిప్రమాదం జరిగిన భవనం చుట్టూ ఎక్కువగా దుకాణాలు ఉన్నాయి. ఫోటో ఫ్రేమ్ షాపులు, పూజ సామాగ్రిని విక్రయించే దుకాణాలు ఉన్నాయి. దీంతో పరిసర ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రమాద ప్రాంతం నుంచి ప్రజలను బయటకు పంపుతున్నారు. దాదాపు మంటలు అదుపులోకి వచ్చినట్లు తెలిసింది.
Also Read: Fire Accident: తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. ఫొటో ఫ్రేమ్స్ షాపులో చెలరేగిన మంటలు
ఇదివా ఉండగా.. తిరుపతి గోవిందరాజస్వామి వారి రథం అగ్నికి ఆహుతి అయినట్లుగా వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని టీటీడీ తెలిపింది. ఆలయం సమీపంలో ఉన్న లావణ్య ఫోటోఫ్రేమ్స్ దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆ దుకాణం మాత్రమే అగ్నికి ఆహుతి అయింది తప్పి గోవిందరాజస్వామి ఆలయ రథానికి ఎటువంటి ప్రమాదం జరగలేదని టీటీడీ అధికారులు వెల్లడించారు. దీనిపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. గోవిందరాజ స్వామి ఆలయం రథం నిప్పు అంటుకుందని దుష్ప్రచారం చేస్తున్నారని.. రథానికి ఎలాంటి మంటలు అంటుకోలేదన్నారు. ముందు జాగ్రత్తగా కాస్త వెనక్కి లాగి పెట్టామని ఆయన చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్‌ను భక్తులు నమ్మొద్దన్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని ఆయన స్పష్టం చేశారు.