Finance Minister: తొమ్మిదేళ్లలో డీబీటీ ద్వారా రూ.2.73 లక్షల కోట్లు ఆదా.. ప్రకటించిన ఆర్థికమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Finance Minister: డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్(డీబీటీ) ద్వారా గత 9 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.2.73 లక్షల కోట్లు ఆదా చేసిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం డిబిటి ద్వారా వివిధ పథకాల కింద ఇచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ చేసింది. దీంతో నకిలీ లేదా బోగస్ ఖాతాల ఖాతాల్లోకి ప్రభుత్వ నిధులు వెళ్లకుండా అరికట్టగలిగినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఇది లీకేజీలను అరికట్టడంలో.. ప్రభుత్వ పథకం నిజమైన, అర్హులైన లబ్ధిదారులకు మెరుగైన ప్రయోజనం చేకూర్చడంలో సహాయపడిందని ఎన్జీవో దిశా భారత్ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి ఆర్థిక మంత్రి మాట్లాడారు. డిబిటిని స్వీకరించినప్పటి నుండి దాని ద్వారా ప్రభుత్వ పనితీరు మెరుగుపడిందని.. దాని సహాయంతో విద్య, ఆరోగ్యానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చని అన్నారు.
Read Also:Uttar Pradesh: యూపీలో దారుణం.. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కాల్చిన దుండగులు
Also Read
- By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
- Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
డీబీటీ ప్రవేశపెట్టడంతో పెన్షన్లు, ఉపాధి హామీ డబ్బు, వడ్డీ రాయితీ, ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ బదిలీలు అర్హులైన లబ్ధిదారుల ఆధార్-ధృవీకరించబడిన బ్యాంకు ఖాతాలకు జమ చేయబడుతున్నాయి. అన్ని నకిలీ ఖాతాలు తొలగించబడ్డాయి. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆర్థిక మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. 2014 సంవత్సరం నుంచి డీబీటీ కింద పథకాలు పెంచామన్నారు. దీని వల్ల రూ.2.73 లక్షల కోట్లు ఆదా చేశామని.. ఈ మొత్తాన్ని ప్రభుత్వం నిర్వహించే అనేక కార్యక్రమాలకు వినియోగిస్తున్నామని చెప్పారు. గత తొమ్మిదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలు, పెరుగుతున్న పోటీ కారణంగా వంటి ముఖ్యమైన సౌకర్యాల ఖర్చు భారీగా తగ్గిందని అన్నారు. 2014లో జీబీకి రూ.308 ఉండగా నేడు జీబీకి రూ.9.94కి తగ్గింది.
Read Also:Kombucha Drink: కొంబుచా డ్రింక్‌తో.. మీ గుండె పదిలం
తాజావార్తలు
-
By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
-
Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
-
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు