Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Fighter Jets Launch From Uss Abraham Lincoln Viral Video Surfaces

Iran-US War: అబ్రహం లింకన్ నౌక నుంచి బయల్దేరిన యుద్ధ విమానాలు.. వీడియో వైరల్

Published Date :April 7, 2026 , 7:37 pm
By Suresh Maddala
  • ఇరాన్‌పై మోపైన యుద్ధం
  • అబ్రహం లింకన్ నౌక నుంచి బయల్దేరిన యుద్ధ విమానాలు
  • హీబ్రూ సందేశంతో వీడియో విడుదల చేసిన యూఎస్
Iran-US War: అబ్రహం లింకన్ నౌక నుంచి బయల్దేరిన యుద్ధ విమానాలు.. వీడియో వైరల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ట్రంప్ హెచ్చరించినట్లుగానే ఇరాన్‌పై యుద్ధం మోపువుతోంది. ఈ రాత్రికి ఇరాన్‌ నాగరికతను అంతం చేస్తామని తాజాగా ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. హెచ్చరించినట్లుగానే అరేబియా సముద్రంలో మోహరించిన అబ్రహం లింకన్ నౌక నుంచి యుద్ధ విమానాలు.. ఇరాన్‌పైకి బయల్దేరాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ రాత్రికి ఒక నాగరికత పూర్తిగా నాశనమవుతుందని ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో సంఘర్షణ తీవ్రతను తెలియజేస్తూ హీబ్రూ సందేశంతో కూడిన ఒక వీడియోను యూఎస్ సెంట్రల్ కమాండ్ విడుదల చేసింది. సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన వీడియో ప్రకారం.. ‘‘ఆపరేషన్ జామ్ అజ్జుమ్’’లో భాగంగా యూఎస్ నేవీ యుద్ధ విమానాలు అబ్రహం లింకన్ (CVN-72) విమాన వాహక నౌక నుంచి బయల్దేరాయి. ఇరాన్‌లోని సైనిక లక్ష్యాలపై యూఎస్ దళాలు తమ దాడులను కొనసాగిస్తున్నాయని సందేశంలో పేర్కొన్నాయి.

ట్రంప్ హెచ్చరిక..
ఈ రాత్రికే ఇరాన్ నాగరికత మొత్తం అంతమైపోతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. 48 గంటల్లో ఇరాన్ ఒప్పందం చేసుకోకపోతే సర్వ నాశనం అవుతుందని ట్రంప్ ముందే హెచ్చరించారు. అయితే ఒప్పందం చేసుకునేందుకు ఇరాన్ నిరాకరించింది. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి 14 మిలియన్లకు పైగా ఇరానీయులు సంసిద్ధత ప్రకటించారని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ అన్నారు.

ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా హెచ్చరికలు జారీ చేశారు. ఈ రాత్రికే ఇరాన్ నాగరికత అంతం అవుతుందని లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు. యుద్ధంలో ఈ రాత్రి అత్యంత కీలకమైనదిగా ట్రంప్ పేర్కొన్నారు. ఈ రాత్రి ఒక నాగరికత పూర్తిగా నాశనమవుతుందని తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. 47 ఏళ్ల అణచివేత, అవినీతి, మరణాలకు ఎట్టకేలకు ముగింపు పలుకుతామని ట్రంప్ ప్రకటించారు.

‘‘ఈ రాత్రి ఒక నాగరికత మొత్తం అంతమైపోతుంది.. దాన్ని ఇక ఎప్పటికీ పునరుద్ధరించలేరు. అలా జరగాలని నేను కోరుకోవడం లేదు. కానీ బహుశా అది జరిగి తీరుతుంది.’’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ పోస్ట్‌లో రాశారు.

ఇదిలా ఉంటే ట్రంప్ హెచ్చరించినట్లుగానే గడువుకు ముందే ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి. విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జ్‌లు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఇరాన్‌లోని ఖర్గ్ ద్వీపంపై అమెరికా క్షిపణి దాడులు చేసింది. అలాగే కరాజ్ నగరంలో విద్యుత్ ప్లాంట్‌పై దాడి చేయగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చమురు కేంద్రమైన ఖార్గ్ ద్వీపాన్ని లక్ష్యంగా చేసుకుని పలు దాడులు జరిగాయని ఇరాన్‌కు చెందిన మెహర్ న్యూస్ పేర్కొంది.

 

מטוסי קרב של חיל הים האמריקאי ממריאים מנושאת המטוסים אברהם לינקולן (CVN-72) במסגרת מבצע #זעם_עצום. כוחות ארצות הברית ממשיכים לבצע תקיפות נגד מטרות צבאיות בתוך איראן. pic.twitter.com/enFmCc6uwt

— U.S. Central Command – Hebrew (@CENTCOMHebrew) April 7, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • fighter jets viral video
  • global conflict update
  • Iran attack latest news
  • Middle East war video
  • Operation Jam Azzum

తాజావార్తలు

  • Iran-US War: అబ్రహం లింకన్ నౌక నుంచి బయల్దేరిన యుద్ధ విమానాలు.. వీడియో వైరల్

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Ronin Hero Rat: బొరియలు తవ్వడం కాదు.. బాంబులు పసిగట్టడం దీని స్పెషాలిటీ! గిన్నిస్ రికార్డు సాధించిన ఎలుక..

  • MS Dhoni-Rohit Sharma: ముగిసిన ధోనీ, రోహిత్ శకం.. అభిమానుల మదిలో చెరగని ముద్ర!

  • బిర్యానీని లొట్టలేసుకుంటూ తింటున్నారా.. జర ఇది చూడండి..

ట్రెండింగ్‌

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions