Iran-US War: అబ్రహం లింకన్ నౌక నుంచి బయల్దేరిన యుద్ధ విమానాలు.. వీడియో వైరల్
- ఇరాన్‌పై మోపైన యుద్ధం
- అబ్రహం లింకన్ నౌక నుంచి బయల్దేరిన యుద్ధ విమానాలు
- హీబ్రూ సందేశంతో వీడియో విడుదల చేసిన యూఎస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రంప్ హెచ్చరించినట్లుగానే ఇరాన్‌పై యుద్ధం మోపువుతోంది. ఈ రాత్రికి ఇరాన్ నాగరికతను అంతం చేస్తామని తాజాగా ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. హెచ్చరించినట్లుగానే అరేబియా సముద్రంలో మోహరించిన అబ్రహం లింకన్ నౌక నుంచి యుద్ధ విమానాలు.. ఇరాన్‌పైకి బయల్దేరాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ రాత్రికి ఒక నాగరికత పూర్తిగా నాశనమవుతుందని ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో సంఘర్షణ తీవ్రతను తెలియజేస్తూ హీబ్రూ సందేశంతో కూడిన ఒక వీడియోను యూఎస్ సెంట్రల్ కమాండ్ విడుదల చేసింది. సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన వీడియో ప్రకారం.. ‘‘ఆపరేషన్ జామ్ అజ్జుమ్’’లో భాగంగా యూఎస్ నేవీ యుద్ధ విమానాలు అబ్రహం లింకన్ (CVN-72) విమాన వాహక నౌక నుంచి బయల్దేరాయి. ఇరాన్‌లోని సైనిక లక్ష్యాలపై యూఎస్ దళాలు తమ దాడులను కొనసాగిస్తున్నాయని సందేశంలో పేర్కొన్నాయి.
Also Read
- Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
- Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్‌లు? అమెరికా హౌస్‌లో కీలక బిల్లు పాస్
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
ట్రంప్ హెచ్చరిక..
ఈ రాత్రికే ఇరాన్ నాగరికత మొత్తం అంతమైపోతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. 48 గంటల్లో ఇరాన్ ఒప్పందం చేసుకోకపోతే సర్వ నాశనం అవుతుందని ట్రంప్ ముందే హెచ్చరించారు. అయితే ఒప్పందం చేసుకునేందుకు ఇరాన్ నిరాకరించింది. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి 14 మిలియన్లకు పైగా ఇరానీయులు సంసిద్ధత ప్రకటించారని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ అన్నారు.
ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా హెచ్చరికలు జారీ చేశారు. ఈ రాత్రికే ఇరాన్ నాగరికత అంతం అవుతుందని లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు. యుద్ధంలో ఈ రాత్రి అత్యంత కీలకమైనదిగా ట్రంప్ పేర్కొన్నారు. ఈ రాత్రి ఒక నాగరికత పూర్తిగా నాశనమవుతుందని తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. 47 ఏళ్ల అణచివేత, అవినీతి, మరణాలకు ఎట్టకేలకు ముగింపు పలుకుతామని ట్రంప్ ప్రకటించారు.
‘‘ఈ రాత్రి ఒక నాగరికత మొత్తం అంతమైపోతుంది.. దాన్ని ఇక ఎప్పటికీ పునరుద్ధరించలేరు. అలా జరగాలని నేను కోరుకోవడం లేదు. కానీ బహుశా అది జరిగి తీరుతుంది.’’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ పోస్ట్‌లో రాశారు.
ఇదిలా ఉంటే ట్రంప్ హెచ్చరించినట్లుగానే గడువుకు ముందే ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి. విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జ్‌లు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఇరాన్‌లోని ఖర్గ్ ద్వీపంపై అమెరికా క్షిపణి దాడులు చేసింది. అలాగే కరాజ్ నగరంలో విద్యుత్ ప్లాంట్‌పై దాడి చేయగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చమురు కేంద్రమైన ఖార్గ్ ద్వీపాన్ని లక్ష్యంగా చేసుకుని పలు దాడులు జరిగాయని ఇరాన్‌కు చెందిన మెహర్ న్యూస్ పేర్కొంది.
מטוסי קרב של חיל הים האמריקאי ממריאים מנושאת המטוסים אברהם לינקולן (CVN-72) במסגרת מבצע #זעם_עצום. כוחות ארצות הברית ממשיכים לבצע תקיפות נגד מטרות צבאיות בתוך איראן. pic.twitter.com/enFmCc6uwt
— U.S. Central Command – Hebrew (@CENTCOMHebrew) April 7, 2026
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్‌లు? అమెరికా హౌస్‌లో కీలక బిల్లు పాస్
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!