Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Fencer Nada Hafez Reveals She Competed While Seven Months Pregnant

Paris Olympics 2024: 7 నెలల నిండు గర్భంతో ఒలింపిక్స్ క్రీడల్లో పోటీ.. తప్పుబడుతున్న ఈజిప్టు దేశస్థులు

Published Date :August 1, 2024 , 4:53 pm
By Mahesh Jakki
  • నిండు గర్భంతో ఒలింపిక్స్ క్రీడల్లో పోటీ
  • ఆమె ధైర్యానికి అభినందనలు
  • తీవ్రంగా తప్పుబడుతున్న ఈజిప్టు దేశస్థులు
Paris Olympics 2024: 7 నెలల నిండు గర్భంతో ఒలింపిక్స్ క్రీడల్లో పోటీ.. తప్పుబడుతున్న ఈజిప్టు దేశస్థులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Paris Olympics 2024: ఒలింపిక్స్ పాల్గొంటే చాలని క్రీడాకారులంతా కలలు కంటూ ఉంటారు. పతకం గెలవకపోయినా ఈ క్రీడల్లో పాల్గొంటే చాలని అహర్నశలు కష్టపడుతుంటారు. అయితే ఈజిప్ట్ ఫెన్సర్ నాడా హఫీజ్ మాత్రం మరో అడుగు ముందు కేసింది. ఏడు నెలల నిండు గర్భంతో పారిస్ ఒలింపిక్స్ పోటీల్లో బరిలోకి దిగింది. ఈజిప్ట్‌కి చెందిన ఫెన్సర్ నాడా హఫీజ్(26), 7 నెలల నిండు గర్భంతో పారిస్ ఒలింపిక్స్‌లో పోటీ పడింది.. మొదటి మ్యాచ్‌లో గెలిచిన ఆమె, రౌండ్ 16లో పోరాడి ఓడింది. ఈ ఓటమి తర్వాత తాను 7 నెలల గర్భవతిని అంటూ బయటపెట్టింది నాడా హఫీజ్.

Read Also: Nikhat Zareen: నిరాశపరిచిన నిఖత్ జరీన్.. ప్రీక్వార్టర్స్‌లో తప్పని ఓటమి

Also Read

  • SRHకి కొత్త హీరో దొరికాడోచ్.. Salil Arora ఆ 'నో-లుక్' షాట్ ఏంటి బ్రో.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
  • Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్‌కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
  • Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
  • Freezer Ice Smell Solution: ఫ్రీజర్‌లోని ఐస్‌ నుంచి దుర్వాసన వస్తుందా..? 2 నిమిషాల్లో తొలగించే సులభమైన చిట్కాలు..!

‘7 నెలల ప్రెగ్నెంట్ ఒలింపియన్! పోడియంలో ఇద్దరు ప్లేయర్లు పోటీ పడతారు, కానీ ఈసారి ముగ్గురు పోటీ పడ్డారు. నేను, నా పోటీదారుడు, ఇంకా ఈ ప్రపంచంలోకి రాని నా లిటిల్ బేబీ!.. నాతో పాటు నా బిడ్డ కూడా ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా ఎన్నో ఛాలెంజ్‌లు ఫేస్ చేసింది. ప్రెగ్నెన్సీ ఎంత ఆనందాన్ని తెస్తుందో అంతే కష్టాన్ని కూడా తెస్తుంది. నా వ్యక్తిగత జీవితాన్ని, క్రీడా జీవితాన్ని బ్యాలెన్స్ చేసేందుకు చాలా కష్టపడ్డాను. పతకం గెలవకలేకపోయినా ఈ ప్రయాణం నాకు సంతృప్తిని ఇచ్చింది.. 16 రౌండ్‌ దాకా రావడం కూడా గొప్ప విజయమే… నన్ను నమ్మిన నా భర్త ఇబ్రహీంకి, నా కుటుంబానికి థ్యాంక్స్.. మూడుసార్లు ఒలింపిక్ ఆడిన నాకు, ఈ ఒలింపిక్ మాత్రం చాలా ప్రత్యేకం! లిటిల్ ఒలింపియన్‌ని మోస్తూ ఈసారి కత్తి పట్టాను.. ’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది ఈజిప్ట్ ఫెన్సర్ నాడా హఫీజ్.

Read Also: Paris Olympics 2024: భారత్‌ ఖాతాలో మరో పతకం.. షూటింగ్‌లో కాంస్యం గెలిచిన స్వప్నిల్! తొలి షూటర్‌గా రికార్డు

ఒలింపిక్స్ వేదికపై గర్భంతో గెలిచి మహిళలందరికీ సందేశం ఇవ్వాలని నాడా హఫీజ్ కలలు కంది. కానీ దురదృష్టవశాత్తూ హఫీజ్ 16వ రౌండ్‌లో ఓటమిని చవిచూసింది. అయితే గర్భం లేదా ప్రసవం ఒక మహిళ గెలుపుకు ఎలాంటి అడ్డంకి కాదని ఈ ఫెన్సర్‌ నిరూపించింది. అయితే ఈజిప్టు ఫెన్సర్‌ 7 నెలల గర్భవతి అయినప్పటికీ ఒలింపిక్స్‌లో పాల్గొన్నట్లు నాడా హఫీజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసేంతవరకు ఈ విషయం చాలా మందికి తెలియదు. ఆమె ధైర్యాన్ని, నిబద్ధతను అందరూ అభినందిస్తున్నారు.

ఈజిప్టు ఫెన్సర్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో కొత్త రికార్డును సృష్టించింది. గర్భంతో ఉన్న నాడా హఫీజ్ తన మూడో ఒలింపిక్స్‌లో తన మొదటి మ్యాచ్‌ను గెలుచుకుంది. మహిళల వ్యక్తిగత ఫెన్సింగ్ పోటీలో 26 ఏళ్ల హఫీజ్ తన తొలి మ్యాచ్‌లో 15-13తో అమెరికాకు చెందిన ఎలిజబెత్ టార్టకోవ్‌స్కీపై గెలిచింది. ఆ తర్వాత 16వ రౌండ్‌లో దక్షిణ కొరియాకు చెందిన జియోన్ హయాంగ్‌తో తలపడింది. అయితే ఈ రౌండ్ లో ఆమెకు ఓటమి ఎదురైంది. అయితే ఫెన్సర్ నాడా హఫీజ్‌ 7 నెలల గర్భంతో పోటీలో దిగడాన్ని ఈజిప్టు దేశస్థులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ‘7 నెలల గర్భంతో మెడల్ గెలుస్తాననే నమ్మకంతోనే ఒలింపిక్స్‌లో అడుగుపెట్టావా? గర్భవతిగా ఉంటూ ఒలింపిక్స్ ఆడాలని అనుకోవడం మంచిదే. కానీ మాకు మా దేశం గెలవడం కావాలి? నీ స్థానంలో మరో ప్లేయర్ ఆడి ఉంటే ఈజిప్టుకి పతకం వచ్చి ఉండేది.. ఒలింపిక్స్ ఉన్నాయని తెలిసి గర్భం ఎలా తెచ్చుకున్నావ్? ఒలింపిక్స్‌కి ముందు లేదా తర్వాత ప్లాన్ చేసుకుని ఉండొచ్చు కదా? ఒలింపిక్స్, నీకోసం ఆడుతున్నావా? లేక దేశం కోసమా? ఫిజికల్‌గా ఫిట్‌గా లేనప్పుడు వేరే ప్లేయర్‌ని ఒలింపిక్స్‌కి పంపించవచ్చుగా..’ అంటూ నాడా హఫీజ్ ఇన్‌స్టా పోస్ట్‌పై కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇలా కామెంట్లు చేస్తున్న వారిలో ఎక్కువమంది ఈజిప్టు దేశస్థులే కావడం గమనార్హం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 7-month pregnant Egyptian fencer
  • Egypt
  • Fencer Nada Hafez
  • Olympics
  • Olympics 2024

తాజావార్తలు

  • Union Bank Recruitment 2026: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1865 పోస్టులు.. మంచి జీతం

  • Pat Cummins: వాళ్లిద్దరూ అరివీర భయంకరులు.. ఐయామ్ సేఫ్ బాబోయ్.. కమ్మిన్స్‌ కీలక వ్యాఖ్యలు!

  • SRHకి కొత్త హీరో దొరికాడోచ్.. Salil Arora ఆ ‘నో-లుక్’ షాట్ ఏంటి బ్రో.. మైండ్ బ్లోయింగ్ అంతే.!

  • Bellamkonda : తిరుమలలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ – కావ్య వివాహం

  • Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్‌కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!

ట్రెండింగ్‌

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions