డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు. యువత మత్తుపదార్థాలకు అలవాటుపడి జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. డ్రగ్స్ మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు. బంగారం లాంటి భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లోని చిక్కడపల్లిలో డ్రగ్ నెట్వర్క్ గుట్టురట్టైంది. బాయ్ ఫ్రెండ్ తో కలిసి లేడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డ్రగ్స్ ను విక్రయిస్తోంది. కాకినాడ నుంచి వచ్చి ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తూ డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన వైనం.
Also Read:Mysaa First Glimpse : రష్మిక మందన్న ‘మైసా గ్లిమ్స్’ రిలీజ్.. రౌడీకి పోటి ఇస్తుందిగా
ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్న సుష్మిత.. తన బాయ్ ఫ్రెండ్ ఇమాన్యుల్ తో కలిసి డ్రగ్స్ దందాకు తెరలేపింది. డ్రగ్స్ అమ్ముతున్న ప్రేమజంటను పోలీసులు అరెస్టు చేశారు. హెచ్ న్యూ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు.. ప్రేమ జంట నుంచి ఎండిఎంఏ, LSD బాటిల్స్, ఓజీ కుష్, 4 లక్షల విలువచేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తూ డ్రగ్స్ అమ్ముతున్న ప్రేమ జంట తీరుపై పలువురు మండిపడుతున్నారు.