డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు. యువత మత్తుపదార్థాలకు అలవాటుపడి జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. డ్రగ్స్ మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు. బంగారం లాంటి భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లోని చిక్కడపల్లిలో డ్రగ్ నెట్వర్క్ గుట్టురట్టైంది. బాయ్ ఫ్రెండ్ తో కలిసి లేడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డ్రగ్స్ ను విక్రయిస్తోంది. కాకినాడ నుంచి వచ్చి ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తూ డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన వైనం. Also Read:Mysaa First Glimpse…
హైదరాబాద్ జగద్గిరిగుట్ట పీఎస్ పరిధి గాజులరామారంలో మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నారు. మూడు సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టడంలేదనే మనస్తాపంతో భవానీ అనే వివాహిత ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. భవానీ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.