డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో 2019లో ఇస్మార్ట్ శంకర్ సినిమా రిలీజ్ అయ్యింది. రామ్ పోతినేని, పూర్తిగా పూరి మార్క్ హీరోగా మారిపోయి సిక్స్ ప్యాక్ చేసి మాస్ లుక్ లోకి వచ్చేసాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత లైగర్ కోసం దాదాపు మూడేళ్ల సమయాన్ని కేటాయించిన పూరి.. ఇప్పుడు మళ్లీ సంవత్సరం లోపే సినిమా కంప్లీట్ చేసి ఆడియెన్స్ ముందుకి తీసుకురాబోతున్నాడు. 2024 మార్చి 8న డబుల్ ఇస్మార్ట్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ముందుగానే అనౌన్స్ చేసి రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేసాడు పూరి జగన్నాథ్. పది రెడ్ బుల్స్ తాగిన ఎనర్జీని ఒక్క సినిమాతో ఇవ్వడానికి ప్రిపేర్ అవుతన్న ఈ కాంబినేషన్ రీసెంట్ గా ఫారిన్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని వచ్చింది.
ఆ తర్వాత ముంబై షెడ్యూల్ ని కూడా పూర్తి చేసాడు పూరి. ఈ షెడ్యూల్ లో ఒక సాంగ్ కూడా షూటింగ్ జరిగిందని సమాచారం. ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ పూర్తి చేయాలని ఫిక్స్ అయిపోయాడట పూరి. ఆ తర్వాత రెండు, మూడు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకొని.. ఎట్టి పరిస్థితుల్లోను మార్చ్ 8న చెప్పిన డేట్ డబుల్ ఇస్మార్ట్ ని రిలీజ్ చేసేయాలని పూరి ప్లాన్ చేసాడని సమాచారం. లేటెస్ట్ గా ఈరోజు పూరి జగన్నాథ్ బర్త్ డే కావడంతో సంజయ్ దత్, రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ ఉన్న ఫోటోని మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ ని చూస్తుంటే రీసెంట్ గా ముంబైలో జరిగిన సాంగ్ షూటింగ్ నుంచి తీసినట్లు ఉంది. రామ్ పోతినేని, సంజయ్ దత్ లు ఒకే స్టైల్ ఆఫ్ కాస్ట్యూమ్ లో ఉన్నారు, మే బీ ఇది ఆ ఇద్దరి మీటింగ్ పాయింట్ లో వచ్చే సాంగ్ అయి ఉండొచ్చు.
To the craftsman who redefined MASS CINEMA in his own style💥
Team #DoubleISMART wishes Our Sensational Director #PuriJagannadh a Blockbuster Birthday 🔥#HBDPuriJagannadh ❤️🔥
Ustaad @ramsayz @duttsanjay @Charmmeofficial @IamVishuReddy @PuriConnects pic.twitter.com/cb9RgKXawH
— Puri Connects (@PuriConnects) September 28, 2023