Mangampeta Incident: కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువును కువైట్ నుంచి వచ్చి మరీ హత్య చేశాడు ఓ తండ్రి కేసు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తిరిగి కువైట్ వెళ్లి ఆ హత్య తానే చేశానని సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. అంతే కాకుండా పోలీసుల చేతకానితనం వల్లే తాను హంతకుడిగా మారాల్సి వచ్చిందని అంటున్నాడు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగపేటలో నిద్రిస్తున్న 59 ఏళ్ల వ్యక్తి రెండు రోజుల క్రితం దారుణ హత్యకు గురయ్యాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు కువైట్ నుంచి ఓ సెల్ఫీ వీడియో వచ్చింది. ఈ హత్య చేసింది తానేనని.. హత్యకు గురైన ఆంజనేయులు బంధువు ఆంజనేయ ప్రసాద్ ఈ వీడియోలో చెప్పాడు. నా కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకే హత్య చేసి మళ్లీ కువైట్ వెళ్లిపోయానని చెప్పాడు.
Read Also: Tomato Price: కిలో టమాటా 75 పైసలే.. లబోదిబోమంటున్న రైతులు
ఈ కేసులో తన కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆంజనేయులును హత్య చేసిన ఆంజనేయ ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. చెన్నై ఎయిర్‌పోర్టులో ఆయనను కడప పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన కూతురి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆంజనేయులును అత్యంత దారుణంగా హత్య చేశాడు ఆంజనేయ ప్రసాద్. అనంతరం పోలీసులు ఎదుట లొంగిపోవడానికి ఇండియాకు వస్తున్నానని ఆంజనేయ ప్రసాద్ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఆంజనేయ ప్రసాద్ భార్య చంద్రకళ కోసం పోలీసులు గాలిస్తున్నారు.