Viral Video : ఇలాంటి తండ్రి ప్రతి ఒక్కరికీ ఉండాలి.. కూతురంటే ఎంత ప్రేమో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తండ్రి కూతురుకు, తల్లి తనయుడికి ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. కూతుర్లు ఎక్కువగా తండ్రినే ఇష్టపడుతూ ఉంటారు. ప్రతీది తండ్రితోనే షేర్ చేసుకుంటూ ఉంటారు. తండ్రికి కూడా తమ కూతురు అంటే పంచప్రాణాలు. కూతురు కోసం తండ్రి ఎంత దూరమైనా వెళతాడు. తండ్రికూతుళ్ల అనుబంధానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతూ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇది చూసిన యూజర్లు భావోద్వేగానికి గురవుతూ తమ తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుతెచ్చుకుంటున్నారు.
Also Read: ITR Refund: లక్షల మంది అందని ఐటీఆర్ రీఫండ్.. ఆలస్యం అయితే ఫైన్ కట్టాల్సిందే
Also Read
- Astrology: జూలై 22 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..!
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
డ్యూటీకి వెళ్లేందుకు మేకప్ వేసుకుంటూ రెడీ అవుతున్న ఓ కూతరికి తన తండ్రి గోరు ముద్దలు తినిపిస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. దీనిని పూజా బిహానీ శర్మ అనే యూజర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. పూజా బిహానీ ఇండిగోలో కంటెంట్ క్రియేటర్, లీడ్ క్యాబిన్ అటెండెంట్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమెకు తన తండ్రితో అనుబంధాన్ని తెలిపే విధంగా ఉన్న ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె డ్యూటీకి వెళ్లేందుకు రెడీ అవుతూ ఉండగా ఆమె తండ్రి ఆమెకు ప్రేమగా గోరు ముద్దులు తినిపిస్తున్నాడు. ఈ వీడియోను షేర్ చేసిన పూజా నాన్న.. ‘ఇప్పటి వరకు ఎప్పుడు దీని గురించి నేను చెప్పలేదు. ఈ రోజు కచ్ఛితంగా ఎక్కువే చెబుతాను. నువ్వు ఇప్పటి వరుకు చేసిన ప్రతిదానికి థ్యాంక్స్ నాన్న. నువ్వు ఎక్కడ ఉంటే అదే నా ఇల్లు. ఐ లవ్ యూ పాపా’అని రాసుకొచ్చింది. ఈ వీడియో అందరి మనసులకు హత్తుకుంటుంది. ఇది చూసిన ప్రతి ఒక్కరు పూజా నువ్వు చాలా లక్కీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా చాల మంది తమ తల్లిదండ్రులతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. తండ్రి స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. ఒక తండ్రి మాత్రమే తన కూతురు కోసం ఇలా చేయగలడు అంటూ కామెంట్ చేస్తున్నారు. చాలా మంది ఇలా తండ్రి ప్రతి ఒక్కరికీ ఉండాలి అని అంటున్నారు. మరి కొంతమంది ఈ సందర్భంగా వారికి తమ తల్లితో ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తుచేసుకుంటున్నారు. తమ అమ్మ ఇలాగే తనుకు గోరు ముద్దలు తినిపిస్తుందని ఓ యూజర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CKYC: బ్యాంకు కస్టమర్స్ కు అలర్ట్.. మీ CKYC నంబర్ తెలుసా?.. ఇలా తెలుసుకోండి
-
Jana Nayagan : విజయ్ ముందు భారీ టార్గెట్స్.. ఫస్ట్ డే వసూళ్లలో రజనీకాంత్ డామినేట్
-
Astrology: జూలై 22 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..!
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!