NTV Telugu Site icon

Madhya Pradesh: ఘోర ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన ట్రక్కు, ఏడుగురి దుర్మరణం

Road Accident

Road Accident

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మజ్‌గవాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నుంజ ఖమ్‌హారియా గ్రామ సమీపంలో ట్రక్కు ఆటోను బలంగా ఢీకొట్టి.. అనంతరం ఆటోపై బోల్తాపడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు మృతి చెందారు. అందులో ఒక చిన్నారి కూడా ఉంది. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Read Also: Jani Master :జానీ మాస్టర్ పై మహిళా కమిషన్ కి ఫిర్యాదు

మృతులు, క్షతగాత్రులందరూ ప్రతాపూర్ వాసులేనని చెబుతున్నారు. కాగా.. ఈ ప్రమాదంపై గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. సంఘటనా స్థలంలో బైటాయించి రాకపోకలను నిలిపివేశారు. ఈ ప్రమాదంపై అధికారులు తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో… సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

Read Also: Dengue: డెంగ్యూ వచ్చిందా?.. ఈ ఆరోగ్య సూత్రాలు పాటించండి!

అనంతరం.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు కూలీలను జబల్‌పూర్‌లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ హాస్పిటల్‌కు తరలించారు. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. మరోవైపు.. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి మోహన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన, గాయపడిన వ్యక్తుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.