ప్రముఖ ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ సురభి జైన్ కన్నుమూశారు. క్యాన్సర్‌తో పోరాడుతూ 30 ఏళ్లకే జీవితాన్ని ముగించింది. గత కొంత కాలంగా అండాశయ క్యాన్సర్‌కు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. కోలుకుంటున్నారని అంతా భావిస్తున్న సమయంలో ఆమె ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో జైన్ విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ఆమె గత కొలంగా అండాశయ క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నారు. ఎనిమిది వారాల క్రితం చివరి పోస్ట్‌లో ఆమె ఆసుపత్రిలో ఉన్న చిత్రాన్ని పంచుకున్నారు. ఇక ఆమె మరణ వార్తను కుటుంబ సభ్యులు ఆమె అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో పంచుకున్నారు.

తన ఆరోగ్యం గురించి మీ అందరకీ చెప్పలేదని జైన్ గుర్తుచేశారు. ప్రతిరోజూ ఎన్నో మెసేజ్‌లు వస్తున్నాయని.. కానీ పరిస్థితులు ఏం బాగోలేదన్నారు. గత రెండు నెలలుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఇక తాను ముగిస్తున్నట్లు ఆమె సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. సురభి జైన్‌కు క్యాన్సర్ సోకడం ఇది రెండోసారి. 27 సంవత్సరాల వయస్సులో మొదటి రోగనిర్ధారణ అయ్యాక ఆమెకు పెద్ద శస్త్రచికిత్స జరిగింది. తాజాగా రెండోసారి తాకడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది. ఆమె గురువారం మరణించిందని.. ఏప్రిల్ 19న ఘజియాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించినట్లు వారు తెలిపారు. జైన్ మరణవార్త తెలియగానే నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అండాశయ క్యాన్సర్ అనేది అండాశయాలలో ఉద్భవించే ఒక రకమైన క్యాన్సర్. ఇది మహిళలకు ముఖ్యమైన ఆరోగ్య సమస్య. ఈ వ్యాధి అండాశయాలలో ప్రాణాంతకంగా మారుతుంది. పెరుగుతున్న కణితి ద్వారా వర్గీకరించబడుతుంది. ఇది ఆరోగ్యకరమైన కణజాలాలను నాశనం చేస్తుంది. భారతదేశంలోని స్త్రీలలో రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్ మూడవ అత్యంత సాధారణ క్యాన్సర్‌గా ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ దీనిపై అధ్యయనం చేస్తోంది.