Viral : మనం రోడ్లపై అప్పుడప్పుడు మందలకు మందలు గొర్రెలు తోలుకుంటూ వాటి కాపరులు వెళ్తుంటే చూసే ఉంటాం. గొర్రెల్లో కొన్ని ఇటు వెళ్తే మరికొన్ని మరోవైపుకు పరిగెడుతుంటాయి. ఈ క్రమంలో గొర్రెల కాపరులు అటు ఇటు పరిగెడుతూ నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొన్ని గొర్రెలు మందనుంచి తప్పి పోవడంతో గొర్రెల కాపరులు వాటి వెతుక్కునే తీరిక లేక నష్టపోతుంటారు కూడా. అలాగే, కొన్ని సార్లు వాటిని మేపేందుకు కాపర్లు జిల్లాలు దాటి మేత కోసం ప్రయాణాలు సాగిస్తుంటారు. ఈ క్రమంలోనే రోడ్డుపై వాహనాలు, రైళ్ల కింద పడి పదులు, వందల సంఖ్యలో గొర్రెలు చనిపోయిన వార్తలు విన్నాం. కానీ, ఇక్కడో గొర్రెల కాపరి ఒక్క గొర్రె కూడా తప్పిపోకుండా వాటన్నింటికి భద్రత కల్పిస్తూ కొత్త ఆవిష్కరణ చేశాడు.
Read Also: Minister Jagadish Reddy: గవర్నర్ పై మంత్రి జగదీశ్ ఫైర్
దీంతో తన మందలోని ఒక్క గొర్రె తప్పిపోవడం కానీ, యాక్సిడెంట్లకు తన గొర్రెలు గురికావడం కానీ జరుగవు. ఈ ఆవిష్కరణను ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన నిపుణులే కాకుండా యూజర్లు కూడా ఆశ్చర్యపోయారు. వైరల్ అవుతున్న వీడియోలో, గొర్రెల కాపరి తన త్రీవీలర్‌పై కూర్చొని నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ గొర్రెలు అతని వెనుక నెమ్మదిగా కదులుతున్నట్లు మీరు చూడవచ్చు. ఈ వ్యక్తి తన కారు వెనుక చక్రాల మెష్‌తో కంచె వేసుకున్నాడు. దాని లోపల గొర్రెలు నడుస్తున్నాయి. కారు నడుపుతున్న వ్యక్తి కూడా రోడ్డుపై నెమ్మదిగా నడుపుతున్నాడు. ఈ 10 సెకన్ల వీడియో ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా కూడా ఈ వీడియోను చాలా ఇష్టపడ్డారు. ఈ వీడియోను 57 వేల కంటే ఎక్కువ మంది వీక్షించారు.
Simple solutions to difficult problems #jugaad pic.twitter.com/LLTWVg7KCV
— Harsh Goenka (@hvgoenka) March 1, 2023