Virat Kohli become 5th Leading Run-Getter In International Cricket: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య గురువారం ఆరంభం అయిన రెండో టెస్ట్ కోహ్లీకి 500వ అంతర్జాతీయ మ్యాచ్. దాంతో 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న విరాట్.. సచిన్ టెండూల్కర్, మహేల జయవర్ధనే, కుమార్ సంగక్కర, సనత్ జయసూర్య, రికీ పాంటింగ్, ఎంఎస్ ధోనీ వంటి దిగ్గజాల సరసన చేరాడు. వీరందరూ 500లకు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు.
క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా గురువారం వెస్టిండీస్‌తో ఆరంభం అయిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. 161 బంతుల్లో 8 ఫోర్లతో 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దాంతో క్రికెట్ చరిత్రలో కోహ్లీ ఎవరికీ సాధ్యం కానీ రికార్డు నెలకొల్పాడు. 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో కనీసం అర్ధ శతకం బాదిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. మరే ఇతర క్రికెటర్ కూడా ఈ ఘనత సాధించలేకపోయాడు.
Also Read: WI vs IND: ముగిసిన తొలి రోజు ఆట.. భారీ స్కోరు దిశగా భారత్!
టెస్టు క్రికెట్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో విరాట్ కోహ్లీ ఐదో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం 7097 పరుగులతో అతడు ఉన్నాడు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (13492) తొలి స్థానంలో ఉన్నాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనే (9509) రెండో స్థానంలో ఉండగా.. దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్ కలిస్ (9033) మూడో స్థానంలో ఉన్నాడు. విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా (7537) నాలుగో స్థానంలో ఉన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో నిలిచాడు. 500వ మ్యాచ్ ఆడుతున్న కోహ్లీ.. 25548 పరుగులు చేశాడు. తొలి స్థానంలో సచిన్ టెండూల్కర్ (34357), కుమార సంగక్కర (28016) రెండో స్థానంలో, రికీ పాంటింగ్ (27483) మూడో స్థానంలో, మహేల జయవర్దనే (25957) నాలుగో స్థానంలో ఉన్నారు.
Also Read: Gold Price Today: వరుసగా మూడో రోజు పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇవే?