Kamareddy Tragedy : కామారెడ్డిలో విషాదం.. సెల్ టవర్ పై ఉరేసుకున్న అన్నదాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamareddy Tragedy : కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నేలతల్లిని నమ్ముకున్న రైతు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరుగాలం కష్టించిన పంటకు నష్ట పరిహారం అందించాలని అధికారుల చుట్టూ తిరిగాడు.. స్పందన లేకపోవడంతో కుటుంబాన్ని పోషించలేక సెల్ టవరెక్కి ఉరేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మెంగారం గ్రామానికి చెందిన పుట్ట ఆంజనేయులు అనే రైతు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకన్న ఘటన అందిరినీ కంటతడి పెట్టిస్తోంది. పుట్ట ఆంజనేయులుకు గ్రామ చెరువు ఆయకట్టు పరిధిలో కొంత భూమి ఉంది. ఆ భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అలా కొంతకాలంగా ఆ భూమిలో పంటలు సాగుచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.
Read Also: Good News For Farmers : ఒకసారి వరి నాటువేస్తే.. నాలుగేళ్లు 8సార్లు కోసుకోవచ్చు
Also Read
- GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
- Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
- Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
- House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
అప్పులు చేసి తన పొలంలో పంట సాగు చేశాడు. చెరువులోంచి పొలాలకు వచ్చే నీరంతా తన పంట పొలం నుంచే వెళ్తుండడంతో ఆంజనేయులు పొలంలోని పంట చేతికందకుండా పోతోంది. దీంతో తన పంటకు జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని కొన్ని రోజలుగా అధికారుల చుట్టూ తిరుగుతూ వారిని ప్రాధేయపడ్డాడు. అయినప్పటికీ అధికారులెవరూ రైతు ఆంజనేయులు వినతిని పట్టించుకోలేదు. అప్పులు ఏలా తీర్చాలో తెలియక, కుటుంబ పోషణ భారమై తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అధికారుల తీరుకు నిరసనగా సెల్‌టవర్ ఎక్కాడు. ఆంజనేయులు సెల్‌టవర్ ఎక్కాడన్న సమాచారం అందుకున్న భార్య పిల్లలు వెంటనే అక్కడికి చేరుకున్నారు. నాన్న కిందకు దిగి రావాలని పిల్లలు వేడుకున్నారు. గుక్కపట్టి ఏడ్చారు. కానీ అప్పటికే ఆంజనేయులు టవల్‌తో ఉరివేసుకున్నాడు. తండ్రి చనిపోయాడని తెలియక.. పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు. ఈ హృదయవిదారక ఘటన అందర్నీ కలచివేసింది.
తాజావార్తలు
-
GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
-
Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో ‘ఇరుముడి’ ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
-
Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
-
Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
-
Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!