IND vs AUS: జార్వో బాబాయ్ మళ్లీ వచ్చేశాడు.. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్కు అంతరాయం! రంగంలోకి కోహ్లీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pitch invader Jarvo 69 returns at IND vs AUS Match: కరోనా మహమ్మారి అనంతరం 2021లో భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సందర్భంగా పదే పదే భారత జెర్సీ ధరించి మైదానంలోకి వచ్చి మ్యాచ్కు అంతరాయం కలిగించిన ‘జార్వో 69’ గురించి మనకు తెలిసిందే. ఇంగ్లండ్ ప్రముఖ యూట్యూబర్ అయిన ‘జార్వో’.. అలియాస్ డేనియెల్ జార్విస్ మరోసారి మైదానంలోకి వచ్చాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో భారత్ జెర్సీ ధరించిన జార్వో.. ఉన్నపళంగా మైదానంలోకి దూసుకొచ్చాడు.
ప్రపంచకప్ 2023లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ మొదలెట్టిన కొద్ధి సేపటికే జార్వో మైదానంలోకి దూసుకొచ్చాడు. సెక్యూరిటీ కళ్లు కప్పి ఆటగాళ్ల వద్దకు పరుగెత్తాడు. దీంతో మ్యాచ్కు అంతరాయం కలిగింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది జార్వోను బయటికి పంపించే ప్రయత్నం చేయగా.. అతడు ససేమిరా అన్నాడు. దాంతో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రంగంలోకి దిగాడు. జార్వో దగ్గరికి వెళ్లి మాట్లాడిన కోహ్లీ.. అతడిని బయటకు పంపేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
జార్వో 69 చేసిన పనికి ఐసీసీ చర్యలు తీసుకుంది. ఇకపై ప్రపంచకప్ మ్యాచ్లకు హాజరుకాకుండా జార్వోపై నిషేధం విధించింది. ఇక ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా 9 వికెట్స్ కోల్పోయింది. 49 ఓవర్లలో 9 వికెట్స్ కోల్పోయిన ఆసీస్ 195 రన్స్ చేసింది.
Jarvo 69 is back, Last time when he invaded the field, Rohit Sharma scored match winning hundred🫣 pic.twitter.com/z6yYQi7AqG
— David. (@CricketFreakD3) October 8, 2023
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..