సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ తరచూ ‘మోదీ గ్యారంటీ’ అని వ్యాఖ్యలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే దీన్ని కొందరు ఆసరాగా తీసుకోని మోదీ గ్యారంటీ కింద డబ్బులు వస్తాయని తప్పుడు వార్తలను ప్రచారం చేశారు. పోస్టాఫీస్‌లో పొదుపు ఖాతాలను తెరిచి ఉంచిన మహిళలికి ప్రతి 3 నెలలకు రూ.3000 జమ అవుతాయని ప్రచారం జరిగింది. దీనితో కొందరు ఏఈ విషయాన్ని గుడ్డిగా నమ్మి కర్ణాటకలోని హుబ్బల్లిలోని పలు పోస్టాఫీస్ లకు మంగళవారం ఉదయం నుంచే ఖాతాలను తెరిచేందుకు పోస్టాఫీస్‌లకు భారీ సంఖ్యలో మహిళలు చేరుకున్నారు.
Also read: KL Rahul-IPL 2024: ఐపీఎల్ 2024కు ముందు.. కేఎల్ రాహుల్ ప్రత్యేక పూజలు!
ఇంతమంది ఒక్కసారిగా పోస్ట్ ఆఫీస్ కు రావడంతో అనుమానం వచ్చిన అధికారులు ఆరా తీయగా, డబ్బులు జమ అవుతాయనే ఖాతాలను తెరిచేందుకు వచ్చామని మహిళలు చెప్పారు. దాంతో వెంటనే పోస్ట్ ఆఫీస్ అధికారులు అప్రమత్తమై.. అవి తప్పుడు వార్తలని, అలాంటి పథకం ప్రస్తుతానికి ఏమి లేదని అధికారులు తెలిపారు. అంతేకాకుండా పోస్ట్ ఆఫీస్ ల ముందు కూడా అదంతా తప్పుడు సమాచారమని, వాటిని నమ్మవద్దని పోస్టర్లు పెట్టారు అధికారులు.
Also read: Peddireddy Ramachandra Reddy: చంద్రబాబు రాజకీయ వికలాంగుడు.. మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
ఇంత చేసినా.. మహిళలు మాత్రం మాట వినకుండా రాత్రి 8గంటల వరకు మహిళలు పోస్టాఫీస్ లకు వచ్చారు. ఈ విషయం మేరకు ఓ సీనియర్ పోస్ట్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘తప్పుడు వార్తలను నమ్మి మహిళలు పోస్టాఫీసుకు వచ్చారు. కాకపోతే ప్రస్తుతం అలాంటి పథకం ఏమి లేదని.. అవన్నీ తప్పుడు వార్తలని వాటిని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.