Fake Liquor: తెలంగాణలోని ఉప్పల్ కేంద్రంగా నడుస్తున్న ఒక ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో అత్యంత ప్రమాదకరమైన స్పిరిట్‌ను ఉపయోగించి నకిలీ విస్కీ, బ్రాంది తయారు చేస్తున్న ముఠాను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా తెలంగాణలో కల్తీ సరుకును తయారీ చేసి రెండు తెలుగు రాష్ట్రలలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. ఈ ముఠా శానిటైజర్ తయారీ కోసం తీసుకున్న స్పిరిట్‌ను వినియోగించి మద్యం తయారీకి దుర్వినియోగం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో ఫార్మా కంపెనీ యజమాని, నవ్య కెమికల్స్ యజమానులు ప్రధాన పాత్రధారులుగా ఉన్నారు. ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు వీరిద్దరినీ అరెస్ట్ చేశారు.
RK Roja: గాల్లో గెలిచిన గాలిగాళ్లు ఎక్కువయ్యారు.. మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు!
నకిలీ మద్యం తయారీకి ఉపయోగించే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన సెక్యూరిటీ లేబుల్స్, ఎంసి విస్కీ బ్రాండ్లకు చెందిన నకిలీ స్టిక్కర్లు ముద్రించి స్పిరిట్‌తో తయారు చేసిన మద్యం పై అంటించి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఈ ముఠాపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో.. ప్రత్యేకంగా సోదాలు నిర్వహించామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి తెలిపారు. ఈ ముఠా దాదాపు 9 నెలలుగా నకిలీ మద్యం తయారీ కొనసాగిస్తూ మార్కెట్లో పెద్ద ఎత్తున సరఫరా చేస్తూ వస్తోందని తెలిపారు.
Shocking Video: ప్రేమ తిరస్కరించడంతో పదవ తరగతి విద్యార్థిని మెడపై కత్తి పెట్టి బెదిరించిన యువకుడు..!
ఈ కల్తీ మద్యం అమ్మకానికి అవసరమైన 25,000 ఖాళీ మద్యం బాటిళ్లు ముందుగానే సేకరించి నిల్వ పెట్టుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ నకిలీ మద్యం ముఠాలో అబ్దుల్ కలాం కూడా కీలకంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు ఈ కేసులో ఏడు మందిని ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.