NTV Telugu Site icon

Fake Documents Mafia: 40 ఎకరాలు.. ఐదు కోట్లు..నకిలీ డాక్యుమెంట్ల మాఫియా గుట్టురట్టు

Stamp Fake

Stamp Fake

ఖాళీగా ఖరీదైన భూమి కనిపిస్తే చాలు మాఫియా రెచ్చిపోతుంది. అనంతపురం జిల్లాలో 5కోట్లు విలువ చేసే 40 ఎకరాలు భూమిని కొట్టేయడానికి కేటుగాళ్ళు పన్నిన కుట్రను భగ్నం చేశారు పోలీసులు. భూ యజమానులకు తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించిన మరీ కోర్టు ద్వారా డైరెక్షన్ భూములు రిజిస్ట్రేషన్ ప్రయత్నాలు ఫలించలేదు.ఏకంగా మృతి చెందిన భూ యజమానులు అమ్మినట్టు,అప్పులు తీసుకున్నట్లు నకిలీ పత్రాలు తెచ్చారు. ఇక్కడే వారి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. నాలుగు సంవత్సరాలుగా పోరాటం చివరికి జిల్లా ఎస్పీ చొరవ నకిలీ పత్రలు గుట్టు రట్టు చేశారు పోలీసులు. జిల్లా ఇటీవల బుక్కరాయసముధ్రం,కుడేరు,అనంతపురం రూరల్ పరిధిలో ఈ నకిలీ భూ పత్రాలు,అమ్మకాలు బయట పడ్డాయి.తాజాగా విడపనకల్లు మండలం లోని గడేకల్ గ్రామంలో వేలుగు చూసింది.

Read Also: Ongole Republic Day: కలెక్టర్ హైటీ కి ప్రజాప్రతినిధుల డుమ్మా!

ఉరవకొండ రూరల్ సిఐ శేఖర్ వెల్లడించిన వివరాల మేరకు విడపనకల్లు గడేకల్ గ్రామానికి చెందిన గుండాల.నారాయణప్పకి గ్రామంలో40 ఎకరాల భూమి ఉంది.ఆయనకి నలుగురు కూతుళ్లు కావడంతో సమీప బంధువులోని ఒకరు సీతారాముడు ఆభూమి మీద కన్ను పడింది.30-10-2016 న నారాయణప్ప చనిపోవడంతో తన దగ్గర 5లక్షల రూపాయల అప్పు తీసుకున్నాడని అందుకు7 ఎకరాలు భూమి అగ్రిమెంట్ రాసుకున్నట్టు కోర్టుని ఆశ్రయించారు సీతారాముడు,ఈవిషయం కుటుంబ సభ్యులు నా నలుగురు కూతుళ్ళ తెలియకుండా కోర్ట్ డైరెక్షన్ లో ఆభూమిని రిజిస్ట్రేషన్ కోసం వెళ్లడం తో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

వారు చెబుతున్న అప్పు, రిజిస్ట్రేషన్ పత్రాలలోని సంతకాలు తమ తండ్రి నారాయణప్పవి కావని చిన్న కూతురు సరితా శైలజ అనుమానం వ్యక్తం చేశారు. అందుకు బ్యాంకు,గ్యాస్, దేనా బ్యాంకు లో వారి తండ్రి బతికుండగా చేసిన సంతకాలు సేకరించి గుత్తి కోర్టు లో దాఖలు చేయడంతో సీతారాముడు అక్రమ రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. దీంతో సీతారాముడుకు తోడుగా అదేగ్రామానికి చెందిన జె. నారాయణ తో కలిసి మరో కంత్రీ ప్లాన్ చేశారు. మృతి చెందిన నారాయణప్ప భార్య వెంకట లక్ష్మీ తమకు భూముల అమ్మకానికి సంబంధించిన అగ్రిమెంట్ రాసి ఇచ్చినట్టు మరో నకిలీ పత్రాలు సృష్టించారు. అందులో బళ్లారి కి చెందిన రంగనాథ్,లోకేష్, కూడా 7.5 ఎకరాలు ను 9.57 లక్షల కు రంగనాథ్ కొన్నట్టు,7.22ఎకరాలు ను లోకేష్ 17.22 లక్షలకు కొన్నట్టు నకిలీ పత్రాలు సృష్టించారు.

అందుకు అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రేషన్ దగ్గర పత్రాలు రాసే హామీదా భాను,ఆమె భర్త కలిసి నకిలీ 100 రూపాయల బ్రాండ్లు తీసుకున్నారు. అవి కూడా నాసిక్ లో తయారీ సంస్థ తేదీన 2018 ఏప్రిల్2 కాగా నవంబర్24,2018 కు అనంతపురం రిజిస్ట్రేషన్ ఆఫీసు వచ్చాయి .తయారీ తేదీ రోజే 21 ఏకరాలు భూమికి వేరు వేరుగా రిజిస్ట్రేషన్ పత్రాలు అగ్రిమెంట్ రాసుకోవడం వెలుగులోకి వచ్చాయి. చిన్న కూతురు శైలజ ఆర్టీఐ సమాచారం ద్వారా వీటిని సేకరించారు. దీంతో నకిలీ కొనుగోలు, అగ్రిమెంట్ పై వివరాలతో ఈ నేల 23-01-2023,న నలుగురు కూతుళ్లు జిల్లా ఎస్పీ పక్కిరప్ప కలిసి ఫిర్యాదు చేసారు. ఎస్పీ ఉరవకొండ సిఐ శేఖర్ ను విచారణ ఆదేశించారు. విచారణలో చివరకు బీమా డబ్బులు కోసం మృతి చెందిన వెంకటలక్ష్మి బ్రతికుండగానే డబ్బులు బళ్ళారి లోని కోటక్ బ్యాంక్ నుంచి తీసుకున్నట్లు గుర్తించారు పోలీసులు. ఎనిమిదిమందిపై కేసు నమోదు కాగా వారిలో ఇద్దరు సీతారాముడు, జె. నారాయణ అరెస్టు చేశారు. మిగిలిన 6 మంది కోసం గాలిస్తున్నారు పోలీసులు.

Read Also: Kangana Ranaut: నా జీవితం నాశనమైనా.. తిరిగి నిలబడే సత్తా ఉంది