Kangana Ranaut: నా జీవితం నాశనమైనా.. తిరిగి నిలబడే సత్తా ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
If I am Completely Ruined I Can Stand On My Feet Again Says Kangana Ranaut: ముక్కుసూటిగా మాట్లాడే అతికొద్దిమంది సినీ తారల్లో బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ఒకరు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన కంగనా.. ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని, ఈరోజు ఈ స్థాయికి చేరుకుంది. స్టార్ స్టేటస్ అందుకున్నా.. ఆమెను ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. అయినా బెదరకుండా ముందుకు సాగిపోతోంది ఈ భామ. గతంలో కొన్ని రిలేషన్‌షిప్స్ వల్ల చాలా ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. వాటిని ఎదుర్కొని తిరిగి నిలబడగలిగింది. ఇండస్ట్రీలో ఉన్న అజ్ఞాత శక్తుల్ని సైతం ఎదురించి, తన సత్తా చాటుకుంటోంది. ఆ ధైర్యంతోనే కంగనా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది.
Emirates Airlines: విమానం గాల్లో ఉండగా పురిటినొప్పులు.. కట్ చేస్తే!
Also Read
- Nani: నాని దర్శకత్వంలో సినిమా? హీరో కాకముందే పూర్తి స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న న్యాచురల్ స్టార్!
- Chiranjeevi : బ్లడ్ అమ్ముకున్నానని అవమానించారు..
- Mohan Babu: "ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు.." మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Kayadu Lohar: పురాణాల్లోని ఆ రాక్షసుడి భార్య పేరు నాకు పెట్టారు.. తండ్రి చేసిన పనిని బయటపెట్టిన కయాదు!
ఇప్పుడు తన ఎమర్జెన్సీ సినిమా కోసం తన ఆస్తులను తనఖా పెట్టింది. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ, ఒకవేళ ఆ సినిమా తేడా కొట్టి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడితే పరిస్థితి ఏంటి? అనే ప్రశ్న కంగనాకి ఎదురైంది. ఇందుకు ఆమె బదులిస్తూ.. తన జీవితం నాశనమైపోయినా పర్లేదు, తిరిగి నిలబడగలనని చెప్పింది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తనకు బిగ్ డీల్ ఏం కాదని, తాను నిమిషాల్లోనే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటానని పేర్కొంది. తాను ముంబైకి కేవలం రూ. 500 మాత్రమే పెట్టుకొని వచ్చానని, ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. ఒకవేళ తాను పూర్తిగా నాశనమైనా, తిరిగి తన కాళ్లపై తాను నిలబడగలిగే ధైర్యం తనకుందని తెలిపింది. తాను టాలెంట్‌ని నమ్ముకొని ముందుకు సాగుతానని, తాను డబ్బులను పెద్దగా ప్రాధాన్యం ఇవ్వనని కంగనా చెప్పుకొచ్చింది.
Sai Dharam Tej: నరేష్ కొడుకు కోసం మెగా మేనల్లుడు సాయం
కాగా.. 1975 నాటి వాస్తవ సంఘటనల ఆధారంగా ‘ఎమర్జెన్సీ’ చిత్రం రూపొందుతోంది. ఇందులో కంగనా ‘ఇందిరా గాంధీ’గా కనిపించడమే కాదు.. దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలను తానే చూసుకుంటోంది. ఇప్పటికే కంగనాకు సంబంధించి విడుదలైన ఇందిరా గాంధీ లుక్‌కి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ఇందులో శ్రేయస్ తల్పడే, అనుపమ్ ఖేర్, మిల్లింద్ సోమన్, సతీష్ కౌశిక్, మహిమా చౌదరి వంటివారు నటిస్తున్నారు.
తాజావార్తలు
-
Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
-
Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
-
AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
-
Sai Dharam Tej : : ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నాకిచ్చిన ఆ డబ్బు ఎప్పటికీ మర్చిపోలేను
-
Nani: నాని దర్శకత్వంలో సినిమా? హీరో కాకముందే పూర్తి స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న న్యాచురల్ స్టార్!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!