NTV Telugu Site icon

Sanjay Raut: యోగి ఆదిత్యనాథ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఫడ్నవీస్ రాజీనామా..

Sanjay Rout

Sanjay Rout

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీకి సీట్లు తగ్గడంపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. నిన్న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన రాష్ట్రంలో బీజేపీ పని తీరుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ఆయన తీరుపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ స్పందించారు. ఇది యోగి ఆదిత్యనాథ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఓ ఎత్తుగడ అని అన్నారు. కొత్త ఎన్డీయే ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు.

Read Also: Justin Trudeau: కెనడా ప్రజాస్వామ్యానికి భారతదేశం రెండవ అతిపెద్ద ముప్పు..

నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనివ్వండి.. స్వీట్లు పంచి పెట్టమని మేము సూచిస్తాం.. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని సంజయ్ రౌత్ అన్నారు. ఈ నిర్ణయం ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్‌లకు అనుకూలంగా ఉందన్నారు. ఈసారి మహారాష్ట్రలో బీజేపీకి తొమ్మిది సీట్లు మాత్రమే వచ్చాయి.. దాని మిత్రపక్షం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఏడు స్థానాల్లో గెలుపొందగా, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ ఒక స్థానాన్ని గెలుచుకుంది అని శివసేన (యూబీటీ) సంజయ్ రౌత్ పేర్కొన్నారు.

Read Also: loksabha election results: బీజేపీ గెలుపు పై అంతర్జాతీయ మీడియా ఫోకస్..

ఇక, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి బిగ్ షా తగిలింది.. దీంతో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది.. 2014, 2019లో యూపీ బలంతో బీజేపీ మెజారిటీ స్థానాలను సాధించింది. ఈసారి ఉత్తరప్రదేశ్ లో బీజేపీ కేవలం 33 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. 2019లో ఈ సంఖ్య 63గా ఉండేది. యూపీ ఫలితాలు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు పెద్ద దెబ్బగా మారింది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో బీజేపీ అద్భుత ప్రదర్శన చేసింది. కానీ, యోగి ఆదిత్యనాథ్ ప్రభావం ఉన్న తూర్పు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ భారీ నష్టాలను చవిచూసింది. ఇటీవలే రామమందిరం ఏర్పాటు చేసిన ఫైజాబాద్ స్థానాన్ని కూడా ఆ పార్టీ కోల్పోయింది.