NTV Telugu Site icon

Fake IPS: నకిలీ ఐపీఎస్ బాగోతం బయటపెట్టిన కుటుంబ సభ్యులు..

Fake Ips

Fake Ips

నకిలీ ఐపీఎస్ అధికారి సూర్య ప్రకాష్ ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారిగా హడావుడి సృష్టించిన సూర్య ప్రకాష్.. అసలు బాగోతం కుటుంబ సభ్యులు బయటపెట్టారు. ఆస్తికోసం, డబ్బుల కోసం కన్నతల్లిని, సొంత తమ్ముడిని అతని కుటుంబాన్ని కూడా బెదిరించాడు. సుమారు రూ.70 లక్షల వరకు నగదు, బంగారం, ఆస్తులు కాజేసి రోడ్డున పడేశాడు. రెండేళ్ల క్రితం నుంచే ఐపీఎస్ ఆఫీసర్‌ని అంటూ కుటుంబ సభ్యులను కూడా నమ్మించే ప్రయత్నం చేసి బెదిరించాడు. దీనిపై కుటుంబ సభ్యులు పోలీసులకు గతంలో ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో రెచ్చిపోయాడు నకిలీ ఐపీఎస్ అధికారి సూర్య ప్రకాష్. 41 ఏళ్లకు ఐపీఎస్‌గా ఉద్యోగం వచ్చిందని ఇంట్లో వాళ్ళని బెదిరించి.. అందిన కాడికి అందినట్టు దోచుకుని మోసం చేశాడు. నకిలీ ఐపీఎస్ అధికారి సూర్యప్రకాష్ వల్ల నష్టపోయిన తమకు ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

Read Also: Kadapa: డిప్యూటీ సీఎం ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం.. విచారణ వేగవంతం

కాగా.. పార్వతీపురం మన్యం జిల్లాలో ఇటీవల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా ఈ నకిలీ ఐపీఎస్ అధికారి పాల్గొన్నాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి కేసును ఛేదించారు. 41 ఏళ్ల బలివాడ సూర్య ప్రకాష్‌ అనే వ్యక్తి ట్రైనీ ఐపీఎస్ అధికారిగా వేషధారణ చేసి యూనిఫామ్‌లో పవన్ కల్యాణ్ పర్యటనకు హాజరైనట్టు ఏఎస్పీ దిలీప్ కిరణ్ వెల్లడించారు. సూర్య ప్రకాష్‌ నడవడిపై కొందరికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్నామని దిలీప్ కిరణ్ తెలిపారు. దర్యాప్తులో సూర్య ప్రకాష్‌ తండ్రి దత్తిరాజేరులో 9 ఎకరాల భూమి కొనుగోలు చేసినప్పటికీ, రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో ఆ భూమిని సొంతం చేసుకునేందుకు పోలీసు అధికారిగా వేషధారణ చేసినట్టు వెల్లడించారు.

Read Also: Shruti Haasan: అమ్మ నాన్న వల్లే మద్యానికి బానిసయ్యా.. శ్రుతి హాసన్ షాకింగ్ కామెంట్స్

Show comments