నకిలీ ఐపీఎస్ అధికారి సూర్య ప్రకాష్ ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారిగా హడావుడి సృష్టించిన సూర్య ప్రకాష్.. అసలు బాగోతం కుటుంబ సభ్యులు బయటపెట్టారు. ఆస్తికోసం, డబ్బుల కోసం కన్నతల్లిని, సొంత తమ్ముడిని అతని కుటుంబాన్ని కూడా బెదిరించాడు. సుమారు రూ.70 లక్షల వరకు నగదు, బంగారం, ఆస్తులు కాజేసి రోడ్డున పడేశాడు.